Netherlands Beat South Africa: నెదర్లాండ్స్ చేతిలో చిత్తయిన దక్షిణాఫ్రికా..టోర్నీ నుంచి నిష్క్రమణ
Netherlands Beat South Africa: టీ20 వరల్డ్‌కప్ హాట్ ఫేవరెట్లలో ఒకటైన సౌతాఫ్రికా కు ఘోర పరాభవం ఎదురైంది. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతిలో చిత్తుగా ఓడి ఏకంగా టోర్నీ నుంచే నిష్క్రమించింది. ఈ గ్రూప్ నుంచి రెండో సెమీస్ బెర్త్.. ఇదే వేదికపై తదుపరి జరిగే బంగ్లాదేశ్-పాకిస్తాన్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్-2 నుంచి రెండో జట్టుగా సెమీస్‌కు అర్హత సాధిస్తుంది.
నెదర్లాండ్స్‌తో జరిగిన అత్యంత కీలకమైన సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. స్టెఫాన్ మైబుర్గ్ (37), మ్యాక్స్ ఓడౌడ్ (29), టామ్ కూపర్ (35), కొలిన్ ఆకెర్‌మన్ (41 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించడంతో నెదర్లాండ్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. బౌలర్లలో కేశవ్ మహారాజ్ 2 వికెట్లు పడగొట్టగా.. అన్రిచ్ నోర్జే, ఎయిడెన్ మార్క్రమ్‌లకు తలో వికెట్ దక్కింది.
తర్వాత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా ఎనిమిది వికెట్లు కోల్పోయి కేవలం 145 రన్స్ మాత్రమే చేయగలిగింది. సౌతాఫ్రికాపై 13 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ విజయం సాధించింది. నెదర్లాండ్స్‌పై సౌతాఫ్రికా ఓడిపోవడంతో ఇండియా సెమీస్ చేరుకుంది. జింబాబ్వే మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ఇండియా సెమీస్ బెర్త్ ఖాయమైంది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిస్తే సెమీస్ చేరేది. కానీ కీలక మ్యాచ్‌లో ఓటమి పాలై వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. గ్రూప్ 2 నుంచి సెమీస్ చేరే రెండో జట్టు ఏదన్నది బంగ్లాదేశ్ పాకిస్థాన్ మ్యాచ్‌పై ఆధారపడి ఉంది.