ఆరు బంతుల్లో.. ఆరు వికెట్లు
ఇప్పటి వరకు బ్యాట్స్‌మెన్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టడం చూశాం కానీ ఒకే ఓవర్లో వికెట్లు తీయడం ఎక్కడా చూడలేదు. కానీ నేపాల్ ప్రో క్లబ్ ఛాంపియన్‌షిప్‌లో ఈ రికార్డు నమోదైంది. ఛాంపియన్‌షిప్‌లో భాగంగా మలేషియా నైన్, పుష్ స్పోర్ట్స్ ఢిల్లీ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మలేషియా నైన్ బౌలర్ విరన్‌దీప్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక హ్యాట్రిక్‌తో పాటు ఒక రనౌట్ కూడా ఉంది.
20వ ఓవర్ ప్రారంభానికి ముందు 131/3 గా ఉన్నపుష్ స్పోర్ట్స్ ఢిల్లీ జట్టు మలేషియా నైన్ బౌలర్ విజృంభణతో ఓవర్ ముగిసే సరికి 132/9గా మారిపోయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మలేషియా నైన్ 17.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.