IND Vs NZ : గిల్ విధ్వంసం అన్ స్టాపబుల్..డబుల్ సెంచరీ..కివీస్ టార్గెట్ 350 రన్స్
Shubman Gill create new record against Newzeland in Hyderabad ODI: శుభ్ మన్ గిల్ చెలరేగాడు. బౌండరీలే హద్దుగా బ్యాటింగ్ విన్యాసం చేసాడు. హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ ను మెమోరబుల్ ఇన్నింగ్స్ తో హీరోగా నిలిచాడు. న్యూజీలాండ్ తో జరుగుతన్న వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 349 పరుగులు చేసింది.శుబ్ మన్ గిల్ 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్ లతో 208 పరుగులు చేసాడు. చివరి ఓవర్ వరకు క్రీజులో ఉండి భారీ స్కోరుకు కారణమయ్యాడు. ఇప్పటి వరకు కివీస్ పైన సచిన్ పేరున ఉన్న 186 పరుగుల అత్యధిక స్కోరును హైదరాబాద్ వేదికగా అధిగమించాడు. డబుల్ సెంచరీల హీరోల సరసన చేరారు. ఓపెనర్ గా వచ్చిన కెప్టెన్ రోహిత్ 34(38 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సులు) పరుగులు చేసిన తర్వాత తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
క్రీజులోకి వచ్చిన కింగ్ కోహ్లీ 8(10 బంతులు, 1 ఫోర్) పరుగులు చేసిన తర్వాత రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. శాంట్నర్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఇసాన్ కిషన్ కేవలం 5(14 బంతులు) పరుగులు చేసిన తర్వాత మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఫెర్గ్యూసన్ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.సూర్య కుమార్ యాదవ్ 31(26 బంతులు, 4 ఫోర్లు) పరుగులు చేసిన తర్వాత నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. పాండ్యా 28, సుందర్ 12 పరుగులు చేసి అవుట్ అయ్యారు. సింగిల్ కోసం రన్ చేసి గిల్ కోసం శార్దూల్ తన వికెట్ త్యాగం చేసాడు. 49వ ఓవర్ లో వరుస సిక్స్ లతో గిల్ తన డబుల్ సెంచరీ పూర్తి చేసాడు. భారీ షాట్ కోసం ప్రయత్నించి అవుట్ అయ్యాడు. గిల్ బ్యాటింగ్ తో హైదరాబాద్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. కివీస్ ముందు 350 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇప్పుడు ఫలితం బౌలర్ల చేతిలో ఉంది.