IND vs NZ: గిల్ మరో సెంచరీ..హైదరాబాద్ గడ్డపై బౌండరీల మోత
Team India Batsman Shubman Gill made Century against Newzealand in Hyderabad ODI: టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మరో సెంచరీ బాదాడు. న్యూజిలాండ్ లో హైదరాబాద్ ఉప్పల్ గ్రౌండ్స్ లో గిల్ తన కెరీర్ లో మూడో సెంచరీ పూర్తి చేసాడు. కాగా, వరుసగా రెండు మ్యాచ్ ల్లో గిల్ సెంచరీలు చేసాడు. శ్రీలంకతో తిరువనంతపురంలో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసిన గిల్, ఇప్పుడు న్యూజీలాండ్ తో హైదరాబాద్ లో వరుస మ్యాచ్ లో సెంచరీ బాదాడు. కేవలం 87 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియకు ఓపెనర్లు మంచి శుభారంభం ఇస్తున్నట్లే కనిపించారు. ఇంతలో రోహిత్ 34(38 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సులు) పరుగులు చేసిన తర్వాత తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
క్రీజులోకి వచ్చిన కింగ్ కోహ్లీ 8(10 బంతులు, 1 ఫోర్) పరుగులు చేసిన తర్వాత రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. శాంట్నర్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఇసాన్ కిషన్ కేవలం 5(14 బంతులు) పరుగులు చేసిన తర్వాత మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఫెర్గ్యూసన్ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.సూర్య కుమార్ యాదవ్ 31(26 బంతులు, 4 ఫోర్లు) పరుగులు చేసిన తర్వాత నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం గిల్ 110 పరుగులతో, హార్డిక్ పాండ్యా 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా ఈ ఇద్దరి భాగస్వామ్యం కొనసాగితే భారీ స్కోరు సాధించే అవకాశం ఉంది.