T20 World Cup: Shadab’s 20-ball fifty powers Pakistan to 185/9 against South Africa
సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ జట్టు 185 పరుగులు చేసింది. కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 43 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లేలో సఫారీ బౌలర్లు పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వికెట్లు పడగొట్టారు. పరుగులు చేయకుండా కట్టడి చేశారు.
గాయపడిన ఫకార్ జమాన్ స్థానంలో జట్టులోకి వచ్చిన మహ్మద్ హారిస్ సఫారీ బౌలర్ల దుమ్ము దులిపాడు. 11 బంతుల్లోనే 28 పరుగులు చేశాడు. ఆ సమయంలో సఫారీ బౌలర్లు విజృంభించారు. 38 పరుగులకు ఒక వికెట్ మాత్రమే కోల్పోయిన పాక్ 43 పరుగులకు చేరుకునే సరికి 4 కీలక వికెట్లు కోల్పోయింది.
ఆ సమయంలో ఇఫ్తికార్ అహ్మద్ పాక్ జట్టుకు అండగా నిలిచాడు. సఫారీ బౌలర్లపై ఆధిపత్యం కనబరిచాడు. బ్యాట్ ఝుళిపించారు. పరుగుల వరద పారించాడు. స్కోర్‌ను పరుగులు పెట్టించాడు. అదే సమయంలో ఇఫ్తికార్‌కు శాదాబా జత కలిశాడు. ఇద్దరూ చెలరేగి ఆడారు. ఇఫ్లికార్ కేవలం 35 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు.
శాదాబ్ మరింత చెలరేగి ఆడాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. 4 సిక్సర్లు, 3 బౌండరీలు బాదాడు. జట్టు స్కోర్ 185 పరుగులు చేరడంతో కీలక పాత్ర పోషించాడు.
Shadab Khan gets to his fifty in just 20 deliveries but falls immediately 🔥#T20WorldCup | #PAKvSA | 📝: https://t.co/3VVq7VAJLt pic.twitter.com/GVnOPcLnjz
— ICC (@ICC) November 3, 2022
Iftikhar Ahmed brings up a quality half-century 💪#T20WorldCup | #PAKvSA | 📝: https://t.co/3VVq7VAJLt pic.twitter.com/iBwYjhlHzr
— ICC (@ICC) November 3, 2022