India Vs Australia: విశాఖలో జోరువాన.. రెండో వన్డేకు వరుణుడి గండం
Second One day may be Postponed due to heavy rain in Vizag
భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య విశాఖలో జరగాల్సిన రెండో వన్డేకు వరుణుడు ఆటంకంగా మారాడు. నగరంలో జోరుగా వాన కురుస్తుండడంతో మ్యాచ్ జరిగే అవకాశం కనిపించడం లేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. విశాఖలో గత రెండు రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు వర్షం కాస్త తగ్గుముఖం పడింది. దీంతో అప్పటి వరకు నిరాశలో ఉన్న అభిమానుల్లో ఒక్కసారిగా ఊపు వచ్చింది. వారి ఉత్సాహం కొద్దిసేపటికే ఆవిరయ్యింది. వర్షం తిరిగి కురవడం ప్రారంభించింది. దీంతో మ్యాచ్ జరగదని ఓ అభిప్రాయానికి వచ్చారు.
భారత్, ఆసీస్ జట్లు నిన్ని సాయంత్రమే విశాఖ చేరుకున్నాయి. ఈ రోజు ఉదయం ప్రాక్టీస్ చేయాలని భావించినా వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ప్రాక్టీస్ మానుకున్నారు. ఇప్పటికే వన్డే సిరీస్ లో భారత జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో మ్యాచ్ హోరాహోరీగా జరుగుతుందని, ఆ రసవత్తర పోరాటం మైదానంలో చూడాలని విశాఖ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆశపడ్డారు. వారి ఆశలపై వరుణుడు నీళ్లు జల్లాడు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.