Commonwealth Games: సంకేత్ సర్గార్‌కు సిల్వర్ మెడల్
కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ తొలి పతకం సాధించింది. వెయిట్ లిఫ్టింగ్ క్యాటగిరీలో భారత్‌కు చెందిన సంకేత్ మహదేవ్ సర్గార్ సిల్వర్ మెడల్ సాధించారు. 55 కిలోల విభాగంలో పతకం సాధించడం ద్వారా భారత్‌కు మొదటి పతకం అందించిన అరుదైన అవకాశం దక్కించుకున్నాడు.
🇮🇳 wins its 1️⃣st 🏅 at @birminghamcg22 🤩#SanketSargar in a smashing performance lifted a total of 248 Kg in 55kg Men’s 🏋️♀️ to clinch 🥈at #B2022
Sanket topped Snatch with best lift of 113kg & lifted 135kg in C&J
Congratulations Champ!
Wish you a speedy recovery#Cheer4India pic.twitter.com/oDGLYxFGAA— SAI Media (@Media_SAI) July 30, 2022
తొలి రోజు సత్తా చాటిన భారత ప్లేయర్లు
కామన్వెల్త్ క్రీడల తొలి రోజున భారత ప్లేయర్లు సత్తా చాటారు. పతకాలేవీ సాధించకపోయినా తమ తమ క్రీడల్లో ముందంజ వేశారు. బ్యాడ్మింటన్, టేబలు టెన్నిస్, స్క్వాష్, స్మిమ్మింగ్, హాకీ విభాగాల్లో గెలుపొంది ముందుకు సాగారు. స్క్వాష్ విభాగంలో 14 ఏళ్ల అనహత్ సింగ్ అద్భుతంగా రాణించింది. తొలి రౌండ్లో ప్రత్యర్దిపై ఘన విజయం సాధించింది. 11-5, 11-2, 11-0 తేడాతో సునాయాశ విజయం అందుకుంది. భారత స్విమ్మర్ శ్రీహరి పురుషుల 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగంలో అద్భుతంగా రాణించాడు. సెమీఫైనల్ 2లో 4వ స్థానంలోను, మొత్తంగా 7వ స్థానంలో నిలిచాడు. తద్వారా ఫైనల్‌కు అర్హత సాధించాడు. రేపు జరిగే ఫైనల్లో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమౌతున్నాడు. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు పాకిస్తాన్‌పై సునాయాశ విజయం అందుకున్నారు. మిక్స్ డ్ విభాగంలో జరిగిన ఈ పోటీల్లో భారత ఆటగాళ్లు 5-0 తేడాతో పాక్ ప్లేయర్లను చిత్తుచేశారు. టేబుల్ టెన్నిస్ విభాగంలో కూడా భారత పురుష, మహిళా జట్లు మెరుగైన ఆట తీరుతో ఆకట్టుకున్నాయి. మహిళా జట్టు సౌతాఫ్రికా, ఫిజి జట్లను ఓడించింది. అదే విధంగా పురుషలు టిటి జట్టు బార్బడోస్, సింగపూర్ జట్లపై విజయం సాధించింది. భారత హాకీ జట్టు ఘనా జట్టుపై ఘన విజయం సాధించింది. భారత మహిళా జట్టు 5-0 తేడాతో సునాయాశంగా గెలుపొందింది.
Sanket Sargar's Medal Ceremony 😍
Take a look 👀
Send in your wishes for our Champ with a indomitable spirit 🙂#Cheer4India#India4CWG2022 @PMOIndia @ianuragthakur @NisithPramanik @IndiaSports @SAI_Patiala @SonySportsNetwk @DDNewslive @ddsportschannel @CGI_Bghm pic.twitter.com/bg3QawT36D
— SAI Media (@Media_SAI) July 30, 2022