Sania Mirza: ఫేర్ వెల్ సమయంలో ఎక్కడా కనిపించని సానియా భర్త షోయబ్ మాలిక్
Sania Mirza’s husband Shoab Malik is not Present in Farewell Matches
టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా కొన్ని వారాల క్రితం ఆట నుంచి రిటైర్మెంట్ ప్రకటించింది. తన సొంత గడ్డపై చివరి సారిగా టెన్నిస్ ఆడాలని భావించింది. హైదరాబాద్ లోని లాల్ బహుదూర్ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, బాలీవుడ్, టాలీవుడ్ కి చెందిన హీరో హీరోయిన్లు సోనియా వీడ్కోలు పలికేందకు హైదరాబాద్ నగరానికి తరలివచ్చారు. మహేష్ బాబు, నమ్రత..కూడా ఫేర్ వెల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంత మంది తరలి వచ్చినా సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ మాత్రం ఎక్కడా కనిపించలేదు.
వీడ్కోలు మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రముఖులు
తెలంగాణ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ సోనియా మీర్జా వీడ్కోలు మ్యాచ్ చూసేందుకు ఎల్బీ స్టేడియంకు వచ్చారు. వారితో పాటు ప్రఖ్యాత రేపర్ స్టాన్, హీరో దుల్ఖార్ సల్మాన్, అజారుద్దీన్, యువరాజ్ సింగ్ తదితరులు ఆ క్షణాలను చూసేందుకు తరలి వచ్చారు.
చిరకాల స్నేహితురాలై మరో టెన్నిస్ గ్రేట్ మరియన్ బార్టోలీ కూడా హైదరాబాద్ నగరానికి విచ్చేసింది. సానియా మీర్జా వీడ్కోలు మ్యాచ్ చూసేందుకు ఎల్బీ స్టేడియం చేరుకుంది. రోహన్ బోపన్న, సారా బ్లాంక్ తదితరులు కూడా ఎల్బీ స్టేడియానికి తరలి వచ్చారు. బాలీవుడ్ తారలు కూడా సానియా మీర్జాకు వీడ్కోలు చెప్పేందుకు ఎల్బీ స్టేడియానికి వచ్చారు. ఫరాఖాన్, హుమా ఖురేషీ వంటి బాలీవుడ్ స్టార్లు స్టేడియంలో సందడి చేశారు. సోనియా మీర్జా తన 20 ఏళ్ల కెరీర్లో 43 WTA టైటిల్స్ సాధించింది. చాలా వారాల పాటు మిక్స్ డ్ విభాగంలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది.