Sania Mirza: సొంతగడ్డపై సానియామీర్జాకు ఘన వీడ్కోలు
Sania Mirza will play a couple of exhibition matches in front of home fans
భారత టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా సొంత గడ్డపై వీడ్కోలు చెప్పేందుకు అభిమానులు సిద్ధమయ్యారు. ఇటీవలే అంతర్జాతీయ మ్యాచుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సానియా మీర్జా హైదరాబాద్ నగరంలో ఫ్రెండ్లీ మ్యాచులు ఆడడం ద్వారా ఆటకు గుడ్ బై చెప్పనుంది. సొంత గడ్డపై ఘనంగా ఫేర్ వెల్ ఇచ్చేందుకు అభిమానులు సిద్ధమయ్యారు. హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో సొంత ప్రేక్షకుల సమక్షంలో ఎగ్జిబిషన్ మ్యాచులు ఆడనుంది.
రేపు జరగనున్న వీడ్కోలు మ్యాచులపై సానియా మీర్జా స్పందించింది. తన కుటుంబ సభ్యులు, తన స్నేహితులు, భర్త ఈ రోజు జరిగే మ్యాచులు చూడడానికి వస్తున్నారని సానియా మీర్జా తెలిపింది. సొంత ప్రేక్షకుల మధ్య ఆడనున్న చివరి మ్యాచ్ గురించి ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నట్లు సానియా మీర్జా తెలిపింది. 20 ఏళ్ల క్రితం తన ప్రయాణం ఎక్కడైతే మొదలైందో అక్కడే తన వీడ్కోలు మ్యాచ్ ఆడడం ఎంతో ఆనందకర విషయమని సానియ మీర్జా తెలిపింది.
రేపు జరగనున్న మ్యాచుల్లో కొంత మంది క్రికెటర్లు, సినిమా నటులు, రోహన్ బోపన్న వంటి టెన్నిస్ ప్లేయర్లు కూడా ఆడనున్నారు. గతంలో సానియా మీర్జాతో మిక్స్ డ్ డబుల్స్ ఆడిన కొందరు ప్లేయర్లు కూడా రేపు జరిగే మ్యాచుల్లో ఆడనున్నారు.
టెన్నిస్ రంగంలో 20 ఏళ్ల క్రితం అరంగేట్రం చేసిన సానియా మీర్జా తన సుదీర్ఘ కెరీర్ లో 44 WTA టైటిల్స్ సాధించింది. అందులో 43 మిక్స్ డ్ డబుల్స్ కాగా, ఒకటి సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. చాలా కాలం పాటు మిక్స్ డ్ డబుల్స్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో నిలిచింది.