Sania Mirza: టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పనున్న సానియా మీర్జా
Sania Mirza retires from Professional Tennis in February
భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా ఆటకు గుడ్ బై చెప్పనుంది. దుబాయ్‌లో ఫిబ్రవరిలో జరిగే 1000వ WTA ఈవెంట్‌లో పాల్గొనే మ్యాచే తన కెరీర్‌లో చివరి మ్యాచ్ అని ప్రకటించింది.
ఈ నెలలో జరిగే ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీలో కూడా సానియా మీర్జా ఆడనుంది. డబుల్స్ విభాగంలో కజకస్తాన్ ప్లేయర్ అన్నా డానిలియాతో కలిసిన ఉమెన్స్ డబుల్స్ పోటీల్లో పాల్గొననుంది. ఇదే ఆమెకు చివరి గ్రాండ్ స్లామ్ ఈవెంట్ కావడం విశేషం. గత ఏడాది మోచేతి గాయం కారణంగా యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకుంది.
గత కొంత కాలంగా గాయాలతో సతమతం అవుతున్న సానియా మీర్జా గత ఏడాది చివరిలోనే రిటైర్‌మెంట్ ప్రకటించాలని భావించింది. గ్రాండ్ స్లామ్ ఈవెంట్‌లో పాల్గొని గుడ్ బై చెప్పాలని భావించింది. యూఎస్ ఓపెన్‌లో పాల్గొనలేకపోవడంతో నిర్ణయం మార్చుకుంది.
రిటైర్‌మెంట్ తర్వాత దుబాయ్‌లో ఉన్న తన అకాడమీపై సానియా మీర్జా ఫోకస్ చేయనుంది. గత పదేళ్లుగా తన భర్త షోయబ్ మాలిక్‌తో కలిసి సానియా మీర్జా దుబాయ్‌లోనే నివాసం ఉంటుంది. దీంతో అక్కడే తన మిగతా జీవితాన్ని గడపాలని ప్లాన్ చేసుకుంటోంది.
భారత్ టెన్నిస్ రంగంలో దిగ్గజ క్రీడాకారణిగా గుర్తింపు తెచ్చుకున్న సానియా మీర్జా తన కెరీక్‌లో 6 గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్స్ నెగ్గింది.
సింగిల్స్ విభాగంలో కూడా కొంత కాలం పాటు అద్వితీయ విజయాలు అందుకుంది. 2005లో హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో WTA సింగిల్స్ టైటిల్ నెగ్గింది. WTA సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి భారత ప్లయర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. ర్యాంకింగ్స్ పరంగా కూడా సానియాకు కొంత కాలం కలిసివచ్చింది. 2007లో ఆమె టాప్ 30లో నిలిచింది. తన కెరీర్‌లో బెస్ట్ ర్యాంక్ అయిన 27వ ర్యాంక్ కూడా కొంత కాలం పాటు నిలబెట్టుకుంది.
Indian tennis player Sania Mirza confirms plan to #retire from professional #tennis after playing Women's Tennis Association (WTA) 1000 next month in Dubai@MirzaSania @WTA pic.twitter.com/rwmxbEkvu0
— DD News (@DDNewslive) January 7, 2023
Sania Mirza has confirmed her retirement from professional #tennis after playing Women's Tennis Association (WTA) 1000 event in Dubai in February.#SaniaMirza #SaniaMirzaRetirement #ATCard pic.twitter.com/4lBjbpSZ5M
— Vineet Sharma (@vineetsharma94) January 7, 2023