Sachin Mile Stone: మార్చి 16…సచిన్ జీవితంలో మరిచిపోలేని రోజు
Sachin Scored his 100th Century on this day in 2012
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్ అభిమానులకు ఎనలేని ఆనందాన్ని కలిగించాడు. భారతదేశం తరపున క్రికెట్ ఆడినంత కాలం కోట్లాది మంది అభిమానులను ఊర్రూతలూగించాడు. పరుగుల వరద పారించాడు. ఎవరికీ సాధ్యం కాని రికార్డులను సొంతం చేసుకున్నారు. సెంచరీల మోత మోగించాడు. వన్డేలు, టెస్టుల్లో వంద సెంచరీలు సాధించాడు. సరిగ్గా ఇదే రోజున సచిన్ తన వందో సెంచరీ చేశాడు.
2012 మార్చి 16న ఢాకాలోని బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్ లో సెంచరీ సాధించాడు. అప్పటికే టెస్టుల్లో 51 సెంచరీలు చేసిన సచిన్ వన్డేల్లో సాధించిన 49వ శతకం ద్వారా మొత్తం 100 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు.
రికార్డుల రారాజు సచిన్
1973లో జన్మించిన సచిన్ 11 ఏళ్ల వయసులోనే క్రికెట్ బ్యాట్ పట్టాడు. నవంబర్ 15, 1989లో భారత జట్టులో స్థానం సంపాదించాడు. 16 ఏళ్ల వయసులోనే పాక్ జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. తక్కువ కాలంలోనే పేరు ప్రఖ్యాతలు సాధించాడు. రికార్డుల మోత మోగించాడు. ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు. అర్జున అవార్డు, ఖేల్ రత్న అవార్డులతో పాటు పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. ఎందరో క్రికెటర్లకు ఆరాధ్యుడిగా మారాడు. క్రికెట్ గాడ్ అనే పేరు సంపాదించుకున్నాడు.
A CENTURY of CENTURIES 🫡💯
🗓️ #OnThisDay in 2012, the legendary @sachin_rt scored his 1️⃣0️⃣0️⃣th ton in international cricket – the only cricketer to achieve this feat 👏 🙌#TeamIndia pic.twitter.com/EhsDhdEJ7s
— BCCI (@BCCI) March 16, 2023
Sachin