Maria Sharapova: 35 ఏళ్ల వయసులో తల్లి అయిన టెన్నిస్ స్టార్, మగ బిడ్డకు జన్మనిచ్చిన మరియా షరపోవా
Maria Sharapova blessed with a Baby Boy: రష్యన్ టెన్నిస్ క్వీన్ మరియా షరపోవా 35 ఏళ్ల వయసులో తల్లయింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తొలిసారిగా తల్లి అనిపించుకున్న ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేసింది. తన బిడ్డకు థియోడోర్ అనే పేరు పెట్టినట్లు కూడా వెల్లడించింది. 42 ఏళ్ల బ్రిటీష్ వ్యాపారవేత్త అలెగ్జాండర్ గిల్స్క్ తో షరపోవా చాలా కాలంగా సహజీవనం చేస్తోంది. 2020లో వారి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో తాను గర్భవతిననే విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేసింది. తమ కుటుంబంలోకి మరో వ్యక్తి వస్తున్నట్లు తన 35వ పుట్టినరోజు నాడు వెల్లడించింది.
టెన్నిస్ క్రీడలో నాలుగు ప్రధానమైన టోర్నీలను గెలిచిన 10 మంది మహిళలలో షరపోవా కూడా ఉంది. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టోర్నీలను తన కెరీర్లో సాధించింది.
17 ఏళ్ల వయసులో వింబుల్డన్ టైటిల్
17 ఏళ్ల వయసులోనే వింబుల్డన్ టైటిల్ నెగ్గి ఒక్క సారిగా టెన్నిస్ ప్రపంచంలో సంచలనంగా మారింది. ప్రపంచాన్ని తనవైపు తిప్పకుంది. 2004లో వింబుల్డన్ టైటిల్ దక్కించుకున్న షరపోవా, 2006లో యూఎస్ ఓపెన్, 2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్, 2012, 2014లో ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలను సాధించింది. రోనాల్డ్ గేరోస్లో రెండు సార్లు తన సత్తా చాటింది.
లండన్ ఒపింపిక్స్ లో సిల్వర్ మెడల్
2012లో లండన్ ఒపింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించింది. 2020లో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పింది. వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇచ్చింది. మొత్తం తన కెరీర్లో షరపోవా 36 టైటిల్స్ సాధించింది. 21 వారాల పాటు ఆమె టెన్నిస్ ర్యాంకింగ్స్ లో టాప్ పొజిషన్లో కొనసాగింది.
ప్రపంచ వ్యాప్తంగా వీరాభిమానులు
ఎంతో అందంగా ఉంటే మరియా షరపోవాకు ప్రపంచ వ్యాప్తంగా వీరాభిమానులు ఉన్నారు. 2004 నుంచి ఆమె ప్రతి కదలికను గమనిస్తున్నారు. ఆమె అందాలకు ఫిదా అవుతున్నారు. ఒక పక్క టెన్నిస్ ఆడుతూ మరో పక్క హాట్ హాట్ ఫోటో షూట్లతో యువతను ఊర్రూతలూగించేది.
#Tenis #Sharapova María Sharapova (35 años) exjugadora (ocupó el número 1 del ranking de la WTA durante 21 semanas) fue mamá x primera vez. La rusa está en pareja con Alexander Gilkes, un multillonario británico. pic.twitter.com/Tj6tSBsstl
— Adrián D'Amelio64 (en 🏠) (@ADamelio64) July 15, 2022