IND VS PAK: టాస్ గెలిచిన రోహిత్ – పాక్ బ్యాటింగ్..!
IND vs PAK in T20 World Cup 2022: క్రికెట్ దీపావళికి మెల్ బోర్స్ గ్రౌండ్ సిద్దమౌంది. భారత్ – పాకిస్థాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించారు. సండే బిగ్ ఫైట్ ను ప్రత్యక్షంగా చూసేందుకు తరలి వచ్చిన అభిమానులతో ఎంసీజీ ప్యాక్ అయింది. వర్షం ముప్పు తప్పటం తో అసలైన టీ20 మజాను ఆస్వాదించేందుకు క్రికెట్ ఫ్యాన్స్ సిద్దమయ్యారు. రోహిత్ – కోహ్లీకి ఎంసీజీలో అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. అక్టోబర్ మాసం అంటే కోహ్లీకి కలిసొచ్చే నెలగా సెంటిమెంట్ ఉంది. ఎంసీజీలో 8 టీ20 మ్యాచ్ లు జరగ్గా, తొలి సారి బ్యాటింగ్ చేసిన టీం ఒక సారి గెలవగా, ఏడు సార్లు రెండో సారి బ్యాటింగ్ చేసిన టీంలు గెలుపొందాయి. ఇక, టీం విషయానికి వస్తే రోహిత్ తన టీంలో 7 బ్యాటర్లు, ఒక ఆల్ రౌండర్ తో పాటుగా 3 బౌలర్లను ఎంపిక చేసుకున్నారు.
మంచి ఫాంలో ఉన్న పాక్ బ్యాటర్లను కట్టడి చేయగలితే మ్యాచ్ పైన భారత్ పట్టు సాధించినట్లే. టీం కూర్పులో రోహిత్ జాగ్రత్తలు తీసుకున్నాడు. తుది జట్టులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్సర్ పటేల్, ఆర్ అశ్విన్, మహ్మద్ శమీ, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్ ను ఎంపిక చేసారు. ఇక పాక్ తుది జట్టులో మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజాం, షాన్ మసూద్, షాదాబ్ ఖాన్, హైదర్ అలీ, ఇఫ్తికార్ అహ్మద్, మహ్మద్ నవాజ్, ఆసిఫ్ అలీ, షాష్ ఆఫ్రిది, నసీం షా, హరీస్ రావుఫ్ ఉన్నారు. పిచ్ పూర్తగా బ్యాటింగ్ కు సహకరిస్తుందని చెబుతున్న సమయంలో, ఛేజింగ్ కు రోహిత్ ప్రాధన్యత ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో, ఇప్పుడు భారత బౌలర్లు ఏ మేర పాక్ బ్యాటర్లను నియంత్రిస్తారనేది ఇంట్రస్టింగ్ గా మారింది.
Can't get bigger than this – Ind 🇮🇳 Vs Pak 🇵🇰 pic.twitter.com/kBZTufVY8M
— Kamlesh Chainani (@KingChiefCK) October 23, 2022
We Are Here! 👌 👌
Melbourne is buzzing & how! 👏 👏#TeamIndia | #T20WorldCup | #INDvPAK pic.twitter.com/MZCpwMqMeb
— BCCI (@BCCI) October 23, 2022