Surya Kumar Yadav: వైరల్ అవుతోన్న రోహిత్ శర్మ ట్వీట్
భారత క్రికెట్ అభిమానుల్లో ఇప్పుడు ఎవరి నోట విన్నా సూర్యకుమార్ యాదవ్ పేరే వినిపిస్తోంది. ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమ్ఇండియా ఓటమిపాలైనా సూర్య 55 బంతుల్లోనే 117 పరుగులు చేశాడు. ఇందులో 14 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ సంచలన ఇన్నింగ్స్ అభిమానులను మైమరపించింది. అది చూసి ప్రతి ఒక్క అభిమానీ సంతోషంలో మునిగితేలారు.
ఈ సమయంలోనే పదేళ్ల కిందట రోహిత్ శర్మ.. అతడి గురించి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. 2011 డిసెంబర్ 10న హిట్‌మ్యాన్ బీసీసీఐ అవార్డ్స్ ఫంక్షన్లో పాల్గొన్నాడు. అక్కడ కొంత మంది యువ క్రికెటర్లను కలిసినట్లు, అందులో సూర్యకుమార్ యాదవ్ అనే ముంబై బ్యాటర్ ఆటను భవిష్యత్‌లో తప్పకుండా చూసి తీరాల్సిందేనని ట్వీట్ చేశాడు కాగా అప్పటి ట్వీట్ ఇంగ్లండ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ సెంచరీ చేయడంతో ఇప్పుడు వైరల్‌గా మారింది. కాగా మ్యాచ్‌లో సూర్య బ్యాటింగ్‌ను చూసి పలువురు ఇంగ్లండ్ ప్లేయర్లు సైతం ఫిదా అయ్యారు.