Roger Binny: రోజర్ బిన్నికి ఊరట, పరస్పర విరుద్ధ ప్రయోజనాల కేసులో రిలీఫ్
Roger Binny gets relief in conflicts of interest Case
బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నికి ఊరట లభించింది. బిన్నిపై దాఖలైన పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించిన కేసు నిలబడలేదు. బీసీసీఐ ఎథిక్స్ కమిటీ అధికారి వినీత్ శరణ్ ఈ కేసును కొట్టివేశారు. సంజయ్ గుప్తా చేసిన ఫిర్యాదులో ఎటువంటి మెరిట్ లేదని వినీత్ శరణ్ తేల్చేశారు.
రోజర్ బిన్నీ కోడలు మయాంతి లాంగర్ కూడా బీసీసీఐ ద్వారా వేతనం పొందుతున్నారని సంజయ్ గుప్తా ఫిర్యాదు చేశారు. రోజర్ బిన్నితో పాటు ఆయన కోడలు ఇద్దరు వ్యక్తులు బీసీసీఐ ద్వారా ప్రయోజనం పొందడం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని సంజయ్ గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఎపెక్స్ కౌన్సిల్ కు చెందిన మాజీ సభ్యుడైన సంజయ్ గుప్తా ప్రముఖ క్రికెటర్లపై కేసులు వేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. సచిన్, గంగూలీ, ద్రావిడ్, లక్ష్మణ్, విరాట్ కోహ్లీ వంటి ప్రముఖ ఆటగాళ్లపై కేసులు వేశాడు. ఓడిపోయారు. తద్వారా పాపులారిటీ సాధిస్తున్నారు. తాను దాఖలు చేస్తున్న కేసుల వివరాలను వందల మంది జర్నలిస్టులకు మెయిల్ చేస్తున్నారు. ఇదొక అలవాటుగా మార్చుకున్నారు.
తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీపై కేసు దాఖలు చేశారు. బీసీసీఐ ఎథిక్స్ కమిటీ అధికారి వినీత్ శరణ్ ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించారు. రోజర్ బిన్నీ కోడలు మయాంతి లాంగర్ స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ లో యాంకర్ గా పనిచేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారని, ఆమె స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ లో ఉద్యోగి కాదని వినీత్ శరణ్ స్పష్టం చేశారు. ఆమె కాంట్రాక్ట పద్దతిలో పనిచేయడం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు రాదని క్లారిటీ ఇచ్చారు.
The BCCI Ethics Officer Justice (Retd) Vineet Saran has "dismissed" the 'Conflict of Interest' case filed against BCCI president Roger Binny, stating that complainant Sanjeev Gupta's claims were devoid of any "merit".
— Saikat Ghosh (@Ghosh_Analysis) January 13, 2023
……