BCCI: రిషబ్ పంత్‌కు అండగా నిలిచిన బీసీసీఐ, కోతల్లేకుండా జీతం చెల్లింపు
Rishab Pant to get Full Salary despite missing action
టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్‌కు బీసీసీఐ అండగా నిలిచింది. కారు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న రిషబ్‌కు జీతంలో కోతలు లేకుండా చూడాలని నిర్ణయించింది. ఐపీఎల్ ఆడకపోయినా 16 కోట్లు చెల్లించాలని భావిస్తోంది. అదే విధంగా సెంట్రల్ కాంట్రాక్ట్ ద్వారా అందనున్న5 కోట్ల రూపాయలు కూడా ఇచ్చేందుకు సిద్దమయింది.
రిషబ్ పంత్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్నాడు. రిషబ్ ఆడడానికి ఇంకా చాలా సమయం పడ్డనుండడంతో ఈ సారి ఐపీఎల్ ఆడే అవకాశం కనిపించడం లేదు. గాయం నుంచి పూర్తిగా కోలుకోడానికి ఇంకా 6 నెలలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆటగాళ్లందరికీ బీసీసీఐ బీమా చేయించింది. దీంతో గాయం కారణంగా ఆటకు దూరమైన ఆటగాళ్లకు ఇన్సురెన్స్ కంపెనీయే చెల్లింపులు చేస్తుంది.
కొన్ని వారాల క్రితం రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురయ్యాడు. యాంటీరియర్ క్రూషియేట్ లిగెమెంట్ (ACL), మీడియల్ కొలేటరల్ లిగమెంట్ (MCL) లకు గాయాలయ్యాయి. కొన్ని రోజుల పాటు డెహ్రాడున్‌లో చికిత్స అందించారు. ఆ తర్వాత ముంబైకి తరలించారు. జనవరి 6వ తేదీన పంత్‌కు సర్జరీ చేశారు. ప్రస్తుతం పంత్ విశ్రాంతి తీసుకుంటున్నాడు.