ICC Test Players of 2022: రిషబ్ పంత్.. టీమిండియా నుంచి ఒకే ఒక్కడు
Rishab Pan is the only Indian Player in the ICC Test team of 2022
టీమిండియా బ్యాటర్ రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ ప్రకటించిన టెస్టు జట్టులో స్థానం సంపాదించాడు. 2022లో జరిగిన టెస్టు మ్యాచుల ఆధారంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్.. ఐసీసీ ఒక జట్టును ప్రకటించింది. ఆ జట్టులో భారత దేశం తరపున రిషబ్ పంత్ ఒక్కడే చోటు దక్కించుకున్నాడు. రిషబ్ పంత్ గత ఏడాది టెస్టు మ్యాచుల్లో అద్భుతంగా రాణించాడు. 12 ఇన్నింగ్స్ లో 680 పరుగులు చేసి సత్తా చాటుకున్నాడు. పంత్ ఇన్నింగ్స్ లో రెండు శతకాలు, నాలుగు అర్ధశతరాలు ఉన్నాయి.
భారత స్టార్ ఆటగాళ్లు చాలా మంది ఉన్నా వారెవరికీ ఐసీసీ టెస్టు జట్టులో స్థానం లభించలేదు. విరాట్ కోహ్లీ, బుమ్రా వంటి ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో వారి పేర్లు జాబితాలో లేకుండా పోయాయి. ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ ఐసీసీ టెస్టు జట్టు కెప్టెన్ కిరీటాన్ని అందుకున్నాడు.
Only Babar Azam in 2022 ICC Test team of the year 🙌❤️👍👌👌
Congratulations once again @babarazam258 👍👌🙌#PakistanCricket #BabarAzam𓃵 pic.twitter.com/at1RLXwrPp— Qadir Khawaja (@iamqadirkhawaja) January 24, 2023