Rahul Dravid: ఇంగ్లండ్ చేరుకున్న టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇంగ్లండ్ చేరుకున్నారు. టెస్టు మ్యాచ్ ఆడనున్న భారత ఆటగాళ్లతో సమావేశం అయ్యారు. పలు సూచనలు చేశారు. జూలై 1 నుంచి ఐదవ టెస్టు మొదలు కానుంది. ఆ మ్యాచ్ ప్రారంభించడానికి ముందు భారత జట్టు ఓ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రావిడ్ ఆటగాళ్లతో పలు అంశాలపై చర్చించారు. హెచ్ కోచ్ ఇంగ్లండ్ చేరుకున్న విషయాన్ని బీసీసీఐ ట్వీట్ చేసింది.
ఓల్డ్ ట్రాఫోర్డ్ లో ఐదవ టెస్టు జరగనుంది. జూన్ 24 నుంచి జూన్ 27 వరకు వార్మప్ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లండ్ చేరుకున్న భారత జట్టు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టింది. గత ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత జట్టు 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. 2021 టెస్టు సిరీస్ జరుగుతున్న సమయంలో కరోనా కలకలం మొదలయింది. భారత జట్టులోని సభ్యులకు కరోనా సోకడంతో చివరి మ్యాచ్‌ను రద్దు చేశారు. జరగాల్సిన చివరి మ్యాచ్‌ను రీ షెడ్యూల్ చేశారు. జూలై 1 నుంచి జూలై 5 వరకు ఆ మ్యాచ్ జరగనుంది.
విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, చటేశ్వర పుజారా, జస్‌ప్రీత్ బుమ్రా, శార్థుల్ ఠాకుర్, శుభ్‌మన్ గిల్, ప్రసిద్ధ్ కృష్ణ, కేఎస్ భరత్ తదితరులు కొన్ని రోజుల క్రితం ఇంగ్లండ్ చేరుకున్నారు. కరోనా సోకడంతో రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లండ్ చేరుకోలేకపోయాడు. రోహిత్ శర్మ విషయంలో కూడా ఇంకా క్లారిటీ రాలేదు.