Rajasthan win : ఐపీఎల్ ప్లే-ఆఫ్స్ రేస్‌లో భాగంగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ ప్లే-ఆఫ్స్ ఆశలను ఒక్క సిక్స్ కొట్టి ధ్రువ్ జురెల్ సజీవంగా నిలిపాడు. రాజస్థాన్ రాయల్స్ తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో పంజాబ్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ జట్టు 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. పంజాబ్ జట్టు 50 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ శామ్ కరన్ 49 పరుగులు, జితేష్ శర్మ 44 పరుగులు, షారూక్ ఖాన్ 41 పరుగులతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించారు. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆదిలోనే బట్లర్ డకౌట్ కావడంతో షాక్ తగిలింది. అయినప్పటికీ మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 50 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు.
28 runs off the penultimate over 🔥🔥@PunjabKingsIPL move to 169/5 🙌
Follow the match ▶️ https://t.co/3cqivbD81R #TATAIPL | #PBKSvRR pic.twitter.com/6wPbjykitj
— IndianPremierLeague (@IPL) May 19, 2023