హైదరాబాద్‌లో మరో ప్రపంచస్థాయి బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే రెండు అకాడమీలతో ఎంతోమందిని తీర్చిదిద్దిన గోపీచంద్‌తో కలిసి కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ వారు ఈ మూడో అకాడమిని ఏర్పాటు చేసారు.
Pullela Gopichand: హైదరాబాద్‌లో మరో ప్రపంచస్థాయి బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే రెండు అకాడమీలతో ఎంతోమందిని తీర్చిదిద్దిన గోపీచంద్‌తో కలిసి కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ వారు ఈ మూడో అకాడమిని ఏర్పాటు చేసారు. పుల్లెల గోపిచంద్ నగరంలో అన్ని హంగులతో ఏర్పాటు చేసిన అకాడమీని ప్రారంభించారు. ఇప్పటికే రెండు అకాడమీలతో గోపిచంద్ ఎంతోమందిని దేశ వ్యాప్తంగా తీర్చి దిద్దారు. ఇప్పుడు కొటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ తమ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా గచ్చిబౌలిలో అంతర్జాతీయ ప్రమాణాలతో హై ఫెర్ఫార్మెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఆరు కోర్టులు, పూర్తిస్థాయి స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, సింథటిక్ ట్రాక్, కోచ్ డెవలప్మెంట్ కోర్సు సదుపాయం ఉందన్నారు. బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఔత్సాహిక, అత్యంత ప్రతిభావంతులైన క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణను అందించడానికి అంతర్జాతీయ స్థాయి కోచ్‌లతో పాటు అధునాతన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను అందిస్తున్నామని తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో అకాడమీ నెలకొల్పాలన్న తన ప్రతిపాదనకు వెంటనే అంగీకరించినందుకకు కోటక్ మహీంద్రా బ్యాంకుకు గోపీచంద్ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ అకాడమీ నుంచి మరికొందరు ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్లు వెలుగులోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ అందించేందుకు అంతర్జాతీయ స్థాయి కోచ్‌లతోపాటు అధునాతిన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు అందిస్తున్నట్టు చెప్పాడు.