Pujara: ఆసీస్ బౌలర్ల ధాటిని తట్టుకున్న పూజారా, 35వ హాఫ్ సెంచరీ పూర్తి
Pujara scored his 35th half Century in Indore against Australia
చటేశ్వర్ పుజారా ఆసీస్ బౌలర్ల ధాటిని తట్టుకున్నాడు. గట్టిగా నిలబడ్డాడు. జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్ లో కూడా ఆసీస్ బౌలర్లు చెలరేగారు. రోహిత్ శర్మ, గిల్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, జడేజా, అశ్విన్, భరత్ వంటి ఆటగాళ్లందరూ ఔటవుతున్నా..పుజారా మాత్రం ఏకాగ్రత కోల్పోకుండా ఆడుతున్నాడు. ఈ క్రమంలో టెస్టుల్లో 35వ అర్ధశతకం స్కోర్ పూర్తి చేసుకున్నాడు. 114 బంతులు ఎదుర్కొన్న పుజారా 50 పరుగులు చేశాడు. కేవలం 5 ఫోర్లు కొట్టాడు.
గిల్ 5 పరుగులు, జడేజా 7 పరుగులు చేయగా..రోహిత్ శర్మ 12 పరుగులు, కోహ్లీ 13 పరుగులు చేశారు. రవిచంద్రన్ అశ్విన్ 16 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 26 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్ నాథన్ లియాన్ 5 వికెట్లు పడగొట్టాడు. స్టార్క్ ఒకటి, కుహ్నేమాన్ ఒక వికెట్ పడగొట్టారు. మొత్తం మీద భారత జట్టు 140 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది.
197 పరుగులకు ఆలౌట్
భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్ అదరగొట్టడంతో ఆస్ట్రేలియా తక్కువ పరుగులకే ఆలౌట్ అయింది.రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు, ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు తీయడంతో ఆసీస్ జట్టు 197 పరుగులకు ఆలౌట్ అయింది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకు ఆలౌట్ అయితే ఆసీస్ జట్టు 197 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ జట్టుకు 88 పరుగుల ఆధిక్యం లభించింది.
156 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ జట్టు కేవలం 41 పరుగులు మాత్రమే జత చేయగలిగింది. 197 పరుగులకు ఆలౌట్ అయింది. 11 పరుగుల తేడాలో 6 వికెట్లు కోల్పోయింది. 186 పరుగులకు 4 వికెట్లు వద్ద ఆసీస్ జట్టు మరో 11 పరుగులు జోడించే సరికి 6 వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయింది.
Cheteshwar Pujara's gritty knock has kept India in the game 👏 #WTC23 | #INDvAUS | 📝: https://t.co/FFaPxt9fIY pic.twitter.com/s1hoOn5YtR
— ICC (@ICC) March 2, 2023
Mr. Dependable! 🫡
An invaluable FIFTY from @cheteshwar1 here in Indore.
His 35th in Test cricket.
Live – https://t.co/t0IGbs2qyj #INDvAUS @mastercardindia pic.twitter.com/e8ElkPcMCJ
— BCCI (@BCCI) March 2, 2023
Pujara