ఇటీవల ఇంగ్లండ్‌లో జరిగిన రాయల్ వన్ డే కప్ (One Day Cup) 2023లో అద్భుతంగా రాణించిన పృథ్వీ షాకు (Prithvi Shah) అదృష్టం కలిసి రాలేదు. నార్తంప్టన్‌షైర్ (Northamptonshire) తరఫున ఆడుతున్న అతను ఒక డబుల్ సెంచరీ, ఒక సెంచరీతో ఈ టోర్నీని ఘనంగా ఆరంభించాడు.
Prithvi Shah : ఇటీవల ఇంగ్లండ్‌లో జరిగిన రాయల్ వన్ డే కప్ (One Day Cup) 2023లో అద్భుతంగా రాణించిన పృథ్వీ షాకు (Prithvi Shah) అదృష్టం కలిసి రాలేదు. నార్తంప్టన్‌షైర్ (Northamptonshire) తరఫున ఆడుతున్న అతను ఒక డబుల్ సెంచరీ, ఒక సెంచరీతో ఈ టోర్నీని ఘనంగా ఆరంభించాడు. కానీ ఆ తర్వాత మోకాలి గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. ఈ వార్త విన్న అభిమానులు అందరూ కూడా షా దురదృష్టం చూసి బాధ పడుతున్నారు.
ఇలాంటి సమయంలో షాకు సంబంధించిన ఒక వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అంతకుముందు తను నార్తంప్టన్‌షైర్‌తో చేరినప్పుడు పృథ్వీ షా.. ఈ వార్త చెప్తూ తన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దాని కింద ఒక అభిమాని.. షాను బాడీ షేమింగ్(Body Shaming) చేస్తూ కామెంట్ చేశాడు. పృథ్వీ షా ఇప్పటికైనా కళ్లు తెరిచి కోహ్లీలా ఫిట్‌నెస్(Fitness) పై ఫోకస్ పెట్టాలని సూచించాడు. దీనికి షా ఇచ్చిన సావేజ్ రిప్లై ఇప్పుడు వైరల్ అవుతోంది.
కోహ్లీ(Kohli) తన ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టిన తర్వాత అతని కెరీర్ మారిపోయిందని, షా కూడా అలాగే చేయాలని సదరు ఫ్యాన్ కామెంట్ చేశాడు. ఇది చూసిన పృథ్వీ షా ఆ ఫ్యాన్ కూడా షాకయ్యేలా రిప్లై ఇచ్చాడు. ‘పృథ్వీ భాయ్. అవీ ఇవీ అంటూ అవసరం లేని వాటి చుట్టూ తిరగకు. కోహ్లీలా నీ బాడీని ట్రాన్స్‌ఫామ్ చేసుకో. తను ఎలాంటి ప్రాసెస్ ఫాలో అయ్యాడో అదే చెయ్యి’ అని ఒక ఫ్యాన్ సలహా ఇచ్చాడు.
సాధారణంగా ఇలాంటి కామెంట్స్‌పై సెలెబ్రిటీలు స్పందించరు. అయితే పృథ్వీ షా దీనికి రిప్లై కూడా ఇచ్చాడు. సదరు ఫ్యాన్ యూజర్ హ్యాండిల్ ‘ఇన్నొసెంట్ పండిట్..’ కావడంతో దీన్ని షా టార్గెట్ చేశాడు. ‘అలాగే పండిట్ గారూ.. మీ ఆజ్ఞ మేరకే నడుచుకుంటాను’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇది చూసిన ఫ్యాన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు. ఆ ట్రోలింగ్ చేసిన ఫ్యాన్ ఇలాంటి రిప్లై ఊహించి ఉండడంటూ కామెంట్స్ చేస్తున్నాడు. దెబ్బకు దిమ్మతిరిగి ఉంటుందంటూ జోకులు పేలుస్తున్నారు.