Oja key comments: శిఖర్ ధావన్‌పై ప్రజ్ఞాన్ ఓజా కీలక వ్యాఖ్యలు.. ధీటుగా బదులిచ్చిన కెప్టెన్
Rohit Sharma Countered Oja: ఓపెనర్ శిఖర్ ధావన్‌పై భారత మాజీ ఆటగాడు ప్రజ్ఞాన్ ఓజా కీలక వ్యాఖ్యలు చేశాడు. శిఖర్ ధావన్ టీ20లకు పనికి రాడని, అతన్ని రానున్న వన్డే ప్రపంచకప్ కోసం భారత మేనేజ్మెంట్ జట్టులో ఉండేలా చేస్తుందని అందుకే ఇటీవల విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిందన్నాడు. దీంతో పాటు ప్రపంచకప్‌లో తనతో కలిసి మ్యాచ్‌ను ప్రారంభించేందుకు రోహిత్ శర్మ విండీస్‌తో వన్డే సిరీస్‌కు శిఖర్ను కెప్టెన్‌గా నియమించాలని బీసీసీఐని కోరినట్లు అనుమానం వ్యక్తం చేశాడు.
ఐతే దీనిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన శైలిలో స్పందించాడు. ఓజా కామెంటేటర్‌గా మారాడన్న సంగతి తనకు తెలియదన్న హిట్‌మ్యాన్.. మైదానం లోపల, వెలుపల ఆటగాళ్ల మధ్య స్నేహ బంధం జట్టుకు కచ్చితంగా మేలు చేస్తుందని తెలిపాడు. ప్రజ్ఞాన్ ఓజా గతంలో వరుసగా విఫలం కావటంతో అతనికి ఎక్కువగా అవకాశాలు రాలేదని, ప్రస్తుతం ఓజా కామెంటరీ బాక్స్‌లో కూర్చొని తన పని తాను చూసుకుంటే మంచిదని ఘాటుగానే రిప్లే ఇచ్చాడు.