India Vs Australia: నాలుగో టెస్టుకు ప్రధాని మోడీ ..ఆస్ట్రేలియా ప్రధాని హాజరు
PM Modi, Australian PM Anthony Albanese to watch India-Australia Test in Ahmedabad
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న నాల్గవ టెస్టు మ్యాచ్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్ చూడడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ వస్తున్నారు. మార్చి 9న జరగనున్న ఈ మ్యాచ్ చూసేందుకు ఇరు దేశ ప్రధానులు రావడంతో పోలీసు యంత్రాంగం పలు ఆంక్షలు విధించింది. తొలి రోజు ఆటకు సంబంధించిన టెకెట్స్ సేల్స్ ఆపేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించట్లేదని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.
నాలుగు రోజుల భారత్ పర్యటన
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ నాలుగు రోజుల భారత పర్యటనకు రానున్నారు. మార్చి 8 నుంచి మార్చి 11 వరకు భారత్ పర్యటనకు వస్తున్నారు. ఇండో ఆస్ట్రేలియా ఎకనమిక్ కో ఆపరేషన్, ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకునేందుకు భారత్ వస్తున్నారు. భారత్ పర్యటనలో ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పాటు పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. హోలీ వేడుకల్లో పాల్గొంటున్నారు. భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న నాల్గవ టెస్టు మ్యాచ్ చూసేందుకు రానున్నారు