టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)దూకుడైన స్వభావం తనకు చాలా ఇష్టమని పాకిస్థాన్ ఓపెనర్(Pakistan opener) ఇమామ్ ఉల్ హక్ అన్నాడు. విజయం కోసం కోహ్లీ పోరాడే విధానం.. విపత్కర పరిస్థితుల్లోనూ పట్టువీడని తత్వం తనను విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పాడు.
Imam Ul Haq : టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)దూకుడైన స్వభావం తనకు చాలా ఇష్టమని పాకిస్థాన్ ఓపెనర్(Pakistan opener) ఇమామ్ ఉల్ హక్ అన్నాడు. విజయం కోసం కోహ్లీ పోరాడే విధానం.. విపత్కర పరిస్థితుల్లోనూ పట్టువీడని తత్వం తనను విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పాడు. కెప్టెన్‌గా (captain)ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లను వారి సొంత గడ్డపై ఓడించిన విరాట్ కోహ్లీ.. స్లెడ్జింగ్‌ను కూడా అదే తరహాలో తిప్పికొట్టాడని తెలిపాడు. విరాట్ కోహ్లీ ఎలాంటి సవాళ్లను అయినా స్వీకరిస్తాడని, అది తనకు బాగా నచ్చుతుందని ఈ పాక్ ఓపెనర్ చెప్పుకొచ్చాడు. ఆసియాకప్ 2023 (Asia Cup 2023)టోర్నీ నేపథ్యంలో ఓ చానెల్‌తో మాట్లాడిన ఇమామ్ ఉల్ హక్ విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు.
ప్రస్తుతం శ్రీలంక వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఇమామ్ ఉల్ హక్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. వరుసగా రెండు వన్డేల్లో గెలిచిన పాకిస్థాన్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. పాకిస్థాన్ వన్డే క్రికెట్ టీమ్‌ను చూసి ప్రత్యర్థి జట్లు భయపడుతున్నాయని ఇమామ్ ఉల్ హక్ తెలిపాడు.
‘నేను వన్డే ప్రపంచకప్, ఆసియాకప్ గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌పైనే ఫోకస్ పెట్టాను. వన్డే వరల్డ్ కప్ కోసం మానసికంగా, శారీరకంగా సిద్దం అవుతున్నా. పాకిస్థాన్ వన్డే టీమ్‌ను చూసి జనాలు భయపడుతున్నారు. ఎందుకంటే మేం సాధించిన విజయాలు అలా ఉన్నాయి. మాకు పటిష్టమైన బౌలింగ్ లైనప్ ఉంది. అలాగే వరల్డ్ క్లాస్ బ్యాటర్లు ఉన్నారు. వన్డేల్లో మా టీమ్ బెస్ట్‌గా ఉంది. జట్టు నిండా ఎంతో అనుభవంతో కూడిన ఆటగాళ్లున్నారు. నేను ఇప్పటి వరకు 60 వన్డేలు ఆడాను. ఫకార్ జమాన్ 70 మ్యాచ్‌లు ఆడితే.. బాబర్ ఆజమ్ 100 దాకా మ్యాచులు ఆడాడు. నసీం, షాహీన్, హారీస్, వసీం జూనియర్, షాదబ్, నవాజ్, ఒసామా మీర్, ఇఫ్తికర్ అమ్మద్, సల్మాన్ ఆలీ అఘా, రిజ్వాన్.. ఇలా మా టీమ్‌లో అందరూ మ్యాచ్ విన్నర్లే ఉన్నారు. నేను జట్టులో ఉన్నానని ఇలా చెప్పడం లేదు. నేను జట్టులో లేకపోయినా.. ఈ జట్టు బలంగానే ఉందని చెప్పేవాడిని. జట్టులో ప్రతీ ఒక్కరికి వారి బాధ్యతపై అవగాహన ఉంది. సునాయసంగా ప్రపంచకప్ గెలుస్తామనే నమ్మకం ఉంది’ అని ఇమామ్ ఉల్ హక్ చెప్పుకొచ్చాడు.
ఆసియాకప్ 2023 టోర్నీ ఆగస్టు 30న ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్‌లో నేపాల్‌తో పాకిస్థాన్ తలపడనుంది. సెప్టెంబర్ 2న జరిగే మ్యాచ్‌లో భారత్-పాక్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.