రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ స్పెన్షన్ విధించింది. నిర్ణీత సమయంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిరవధికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
WFI : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(WFI)పై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(UWW)సస్పెన్షన్ విధించింది. నిర్ణీత సమయంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిరవధికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. యూడబ్ల్యూడబ్ల్యూ వేటుతో అప్‌కమింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో(World championship) భారత రెజ్లర్లు జెండా లేకుండా బరిలోకి దిగనున్నారు. సెప్టెంబరు 16 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో భారత రెజ్లర్లు ‘తటస్థ అథ్లెట్లు’గా పోటీ పడుతారు. ‘డబ్ల్యూఎఫ్ఐ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఎన్నికలు(WFI Executive committee Elections) నిర్వహించనందుకు గానూ సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు యూడబ్ల్యూడబ్ల్యూ.. డబ్ల్యూఎఫ్ఐ అడహాక్ కమిటీకి సమాచారం ఇచ్చింది’ అని భారత ఒలిపింక్ అసోసియేషన్ (IOA) పేర్కొంది.
డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు(Wrestlers) చేసిన లైంగిక వేధింపుల(Sexual Harrasment) ఆరోపణలతో భారత రెజ్లింగ్ సమాఖ్య వివాదంలో చిక్కుకుంది. ఈ క్రమంలోనే డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్‌ను ఐఓఏ రద్దు చేసింది. ఆ తర్వాత కార్యకలాపాల నిర్వహణ బాధ్యతను అడ్‌హక్ కమిటీకి అప్పగించింది. ఆగస్టు 27న ఈ కమిటీ ఏర్పాటవ్వగా.. అక్కడి నుంచి 45 రోజుల్లోగా డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్‌కు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీనిపై ఏప్రిల్ 28న యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ స్పందిస్తూ.. గడువులోగా ఎన్నికలు పూర్తిచేయాలని, లేదంటే సస్పెన్షన్ వేటు వేయాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. అయితే, అప్పటి నుంచి పలు కారణాలతో ఈ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి.
చివరిసారిగా ఆగస్టు 12వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించగా.. దానికి ఒక రోజు ముందు పంజాబ్-హరియాణా హైకోర్టు ఈ ఎన్నికలపై స్టే విధించింది. దీంతో ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే ప్రపంచ రెజ్లింగ్ అసోసియేషన్.. భారత సభ్యత్వంపై వేటు పడింది. మరోవైపు రెజ్లర్ల ఆందోళనతో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.