NZ vs Srilanka: లంకపై న్యూజిలాండ్ గెలుపు
NZ vs Srilanka: శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో అహ్మదాబాద్ టెస్టు విజయంతో సంబంధం లేకుండానే భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరుకుంది. ఉత్కంఠగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆఖరి బంతికి న్యూజిలాండ్ విజయాన్ని అందుకొంది. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో కివీస్ రెండు వికెట్లతో చిరస్మరణీయ గెలుపును నమోదు చేసింది. నెగ్గాలంటే ఆఖరి బంతికి ఒక పరుగు అవసరమవగాఉత్కంఠరీతిలో న్యూజిలాండ్ గెలుపొందింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 355 పరుగులకు ఆలౌటయ్యింది. కెప్టెన్ కరుణ రత్నే 50, కుశాల్ మెండిస్ 87 హాఫ్ సెంచరీలు సాధించగా.. మాథ్యూస్ 47, ధనంజయ డిసిల్వా 46 రాణించారు. బదులుగా న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 373 పరుగులు చేసింది. కివీస్ ఓ దశలో 260 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కానీ డారెల్ మిచెల్ 102, మ్యాట్ హెన్రీ 72 పరుగులతో లంక బౌలర్లకు చుక్కలుచూపించారు. శ్రీలంకపై తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో చివరి బంతికి న్యూజిలాండ్ విజయం సాధించింది. ఆఖరి ఓవర్ లో తొలి 3 బంతుల్లో 3 పరుగులు రాగా.. హెన్రీ 4 పరుగులకు రనౌటయ్యాడు. నాలుగో బంతికి విలియమ్సన్ ఫోర్ కొట్టి స్కోరు సమం చేశాడు. అయితే, ఐదో బంతికి బౌన్సర్ వేసిన ఫెర్నాండో పరుగు రాకుండా అడ్డుకున్నాడు. ఇక ఆఖరి బంతిని కూడా బౌన్సర్ వేసినా.. బ్యాటర్లు సింగిల్ తీయడంతో లంకకు పై కివీస్ గెలుపు తధ్యమైంది.