India Vs New Zealand: 108 పరుగులకే కుప్పకూలిన కివీస్
New Zealand team all out for 108 runs in 2nd ODI
భారత జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో కివీస్ జట్టు చేతులెత్తేసింది. కేవలం 108 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ల ధాటికి తలవంచింది. ఏ దశలోను ప్రతిఘటించలేకపోయింది. తడబాటుకు లోనయింది. క్రమక్రమంగా వికెట్లు కోల్పోయింది. తక్కువ స్కోర్ కే ఇన్నింగ్స్ ముగించింది.
మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ రెండే వికెట్లు దక్కించుకున్నారు. మహ్మద్ సిరాజ్, శార్ధుల్ ఠాకుర్, కులదీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు. 6 పరుగుల వ్యవధిలోనే చివరి 4 వికెట్లు పడిపోయాయి. 102 పరుగులకు 6 వికెట్లు మాత్రమే కోల్పోయిన కివీస్ జట్టు 108 పరుగులకు ఆలౌట్ అయింది. గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ బ్రాస్ వెల్, మిచెల్ సాంట్నర్ కొంతలో కొంత భారత బౌలర్లను ఎదుర్కోగలిగారు. రెండంకెల స్కోర్ చేశారు. 35వ ఓవర్ 3వ బంతికే కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. కులదీప్ యాదవ్ కు చివరి వికెట్ దక్కింది.
15 పరుగులకే 5 వికెట్లు
కివీస్ జట్టు పరుగుల ఖాతా తెరవక ముందే తొలి వికెట్ కోల్పోయింది. మహ్మద్ షమీ వేసిన మొదటి ఓవర్ 5వ బంతికి ఓపెనర్ ఫిన్ అలెన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. అక్కడి నుంచి వికెట్ల పతనం కొనసాగింది.
ఇన్నింగ్స్ 6వ ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్ హెన్నీ నికోలస్ వికెట్ పడగొట్టాడు. కేవలం 2 పరుగులు చేసిన హెన్రీ రెండో వికెట్ గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 7వ ఓవర్ లో కివీస్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. మహ్మద్ షమీ మరోసారి విజృంభించి బౌలింగ్ చేశాడు. డారిల్ మిచెల్ ను ఒక్క పరుగుకే పెవిలియన్ పంపించాడు.10వ ఓవర్ లో కివీస్ జట్టు నాల్గవ వికెట్ కోల్పోయింది. వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఓ అద్భుతమైన క్యాచ్ పట్టడం ద్వారా డెవన్ కాన్వేను పెవిలియన్ పంపాడు. కాన్వే ఔటయ్యే సమయానికి కివీస్ జట్టు స్కోర్ కేవలం 14 పరుగులే.
11వ ఓవర్ లో కివీస్ జట్టు ఐదవ వికెట్ కోల్పోయింది. శార్ధుల్ ఠాకుర్ వేసిన ఆ ఓవర్లో టామ్ లాథమ్ ఔటయ్యాడు. తన వైపు వచ్చిన బంతిని శుభ్ మన్ గిల్ క్యాచ్ పట్టడం ద్వారా టామ్ లాథమ్ ఔటయ్యాడు. ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు.
.@MdShami11 set the ball rolling and was #TeamIndia's top performer from the first innings of the 2⃣nd #INDvNZ ODI 🙌 🙌
A summary of his bowling performance 🔽 pic.twitter.com/4f8qnUSJze
— BCCI (@BCCI) January 21, 2023
Innings Break!
A brilliant bowling performance from #TeamIndia 👏 👏
3⃣ wickets for @MdShami11
2⃣ wickets each for @hardikpandya7 & @Sundarwashi5
1⃣ wicket each for @mdsirajofficial, @imkuldeep18 & @imShardScorecard ▶️ https://t.co/tdhWDoSwrZ #INDvNZ | @mastercardindia pic.twitter.com/0NHFrDbIQT
— BCCI (@BCCI) January 21, 2023
.@Sundarwashi5 🤝 @surya_14kumar
New Zealand 9 down as Lockie Ferguson gets out.
Follow the match ▶️ https://t.co/tdhWDoSwrZ #TeamIndia | #INDvNZ | @mastercardindia pic.twitter.com/tQiYfWQan5
— BCCI (@BCCI) January 21, 2023