India VS New Zealand: కష్టాల్లో కివీస్, 15 పరుగులకే 5 వికెట్లు డౌన్
New Zealand lost 5 Wickets when the score is 15 runs
రాయ్ పుర్ లో జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. కివీస్ బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. కేవలం 15 పరుగులకే 5 కీలక వికెట్లు పడగొట్టారు. మహ్మద్ షమీ రెండు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, శార్ధుల్ ఠాకుర్, హార్ధిక్ పాండ్యా చెరో వికెట్ తీసుకున్నారు. కివీస్ టాపార్డర్ బ్యాటర్లు ఎవ్వరూ భారత బౌలర్లను ప్రతిఘటించలేకపోయారు. సింగిల్ డిజిట్ కే పెవిలియన్ చేరుకున్నారు.
కివీస్ జట్టు పరుగుల ఖాతా తెరవక ముందే తొలి వికెట్ కోల్పోయింది. మహ్మద్ షమీ వేసిన మొదటి ఓవర్ 5వ బంతికి ఓపెనర్ ఫిన్ అలెన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. అక్కడి నుంచి వికెట్ల పతనం కొనసాగింది.
ఇన్నింగ్స్ 6వ ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్ హెన్నీ నికోలస్ వికెట్ పడగొట్టాడు. కేవలం 2 పరుగులు చేసిన హెన్రీ రెండో వికెట్ గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 7వ ఓవర్ లో కివీస్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. మహ్మద్ షమీ మరోసారి విజృంభించి బౌలింగ్ చేశాడు. డారిల్ మిచెల్ ను ఒక్క పరుగుకే పెవిలియన్ పంపించాడు.
10వ ఓవర్ లో కివీస్ జట్టు నాల్గవ వికెట్ కోల్పోయింది. వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఓ అద్భుతమైన క్యాచ్ పట్టడం ద్వారా డెవన్ కాన్వేను పెవిలియన్ పంపాడు. కాన్వే ఔటయ్యే సమయానికి కివీస్ జట్టు స్కోర్ కేవలం 14 పరుగులే.
11వ ఓవర్ లో కివీస్ జట్టు ఐదవ వికెట్ కోల్పోయింది. శార్ధుల్ ఠాకుర్ వేసిన ఆ ఓవర్లో టామ్ లాథమ్ ఔటయ్యాడు. తన వైపు వచ్చిన బంతిని శుభ్ మన్ గిల్ క్యాచ్ పట్టడం ద్వారా టామ్ లాథమ్ ఔటయ్యాడు. ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు.
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗖𝗔𝗧𝗖𝗛! 😎
Talk about a stunning grab! 🙌 🙌@hardikpandya7 took a BEAUT of a catch on his own bowling 🔽 #TeamIndia | #INDvNZ | @mastercardindia pic.twitter.com/saJB6FcurA
— BCCI (@BCCI) January 21, 2023
#TeamIndia are making merry & how! 👍 👍
It's raining wickets 👏 👏
Vice-captain @hardikpandya7 & @imShard have joined the wicket-taking party 🎉 🎉
New Zealand 5 down.
Follow the match ▶️ https://t.co/tdhWDoSwrZ #INDvNZ | @mastercardindia pic.twitter.com/yTNTvdXvZZ
— BCCI (@BCCI) January 21, 2023