NZ Vs Eng: న్యూజిలాండ్ థ్రిల్లింగ్ విక్టరీ…1 పరుగు తేడాతో
New Zealand beat England by one run in secondTest: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో న్యూజిలాండ్ థ్రిల్లింగ్ విక్టరీ దక్కించుకుంది. టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత.. ఒక్క పరుగు తేడాతో గెలిచిన న్యూజిలాండ్ అరుదైన ఘనత సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను 1-1 డ్రా చేసుకుంది. న్యూజీలాండ్ -ఇంగ్లాండ్ మధ్య వెల్లంగ్టన్ లో జరుగుతున్న రెండో టెస్టుకు కివీస్ ఆటగాళ్లు థ్రిల్లింగ్ ముగింపు ఇచ్చారు. ఈ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో 258 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 256 పరుగులకు ఆలౌటైంది. బంతిబంతికి ఆసక్తికరంగా మారిన మ్యాచ్ చివరకి విజయం కివీస్ ను వరించింది. ఈ విజయంతో కివీస్ రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుంది.
ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్ 435 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కివీస్ 209 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్‌ను ఇంగ్లండ్ ఫాలోఆన్ ఆడించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కేన్ విలియమ్సన్(132) సెంచరీతో చెలరేగడంతో కివీస్ 483 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్ ముందు 258 పరుగుల టార్గెట్‌ను ఉంచగలిగింది. రెండో ఇన్నింగ్స్ లో కివీస్ బౌలర్లు ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్స్ ఒక్కోక్కరు పెవిలియన్ దారి పట్టారు. చివర్లో బెన్ స్టోక్స్(33 పరుగులు), బెన్ ఫోక్స్‌లు(35 పరుగులు) తో రాణించిన ఫలితం లేకుండా పోయింది. కివీస్ బౌలర్లలో నీల్ వాగ్నర్ నాలుగు వికెట్లు తీయగా.. సౌథీ మూడు, మాట్ హెన్రీ రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ ఫలితం మాత్రం క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది.