ముంబై జట్టు ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ జట్టుపై 8 వికెట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. 201 పరుగుల లక్ష్యాన్ని మరో 12 బంతులు మిగిలి ఉండగానే చేరుకుంది. ముంబై బ్యాటర్ కెమరున్ గ్రీన్ 18వ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీయడం ద్వారా తన సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు జట్టుకు విజయాన్ని అందించాడు
Mumbai Indians wins by 8 wkts against SRH
ముంబై జట్టు ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ జట్టుపై 8 వికెట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. 201 పరుగుల లక్ష్యాన్ని మరో 12 బంతులు మిగిలి ఉండగానే చేరుకుంది. ముంబై బ్యాటర్ కెమరున్ గ్రీన్ 18వ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీయడం ద్వారా తన సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు జట్టుకు విజయాన్ని అందించాడు.
47 బంతుల్లో సెంచరీ చేసిన కెమరున్ గ్రీన్
కెమరున్ గ్రీన్ మెరుపులు మెరిపించాడు. 47 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఐపీఎల్ కెరీర్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. తన సెంచరీలో 80 పరుగులు బౌండరీల రూపంలో వచ్చినవే కావడం విశేషం. 8 ఫోర్లు 8 సిక్సర్లు బాదిన కెమరున్ గ్రీన్ ముంబై జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
201 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై జట్టుకు సన్‌రైజర్స్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ షాక్ ఇచ్చాడు. మూడవ ఓవర్లోనే ఇసాన్ కిషన్ వికెట్ పడగొట్టాడు. వికెట్ పడిన ఆనందం కాసేపటికే ఆవిరయింది. ఇషాన్ కిషన్ ఔటైన తర్వాత వచ్చిన కెమరున్ గ్రీన్ తిరుగులేని ఆధిపత్యం కొనసాగించాడు. సన్‌రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మయాంక్ డేగర్ వేసిన 7వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు. కేవలం 20 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. కీలక సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సన్‌రైజర్స్ బౌలర్లపై మెరుపుదాడి చేశాడు. చివరి వరకు నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
9వ ఓవర్లో 19 పరుగులు
వివ్రాంత్ శర్మ ఒకే ఒక్క ఓవర్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో ముంబై బ్యాటర్లు వీరవిహారం చేశారు. ఏకంగా 19 పరుగులు పిండుకున్నారు. కసి తీర్చుకున్నారు. ఆ ఓవర్లో వివ్రాంత్ శర్మ 8 బంతులు వేయాల్సి వచ్చింది. ఒక వైడ్, ఒక నో బాల్ వేసిన కారణంగా అదనపు పరుగులు సమర్పించుకున్నాడు. 9వ ఓవర్లో 19 పరుగులు లభించాయి. ఉమ్రాన్ మాలిక్ వేసిన 10వ ఓవర్లో రోహిత్ శర్మ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు. ఆ ఓవర్లో ముంబై జట్టుకు 14 పరుగులు లభించాయి.
నితీశ్ కుమార్ రెడ్డి వేసిన 13వ ఓవర్లో ముంబై జట్టు 16 పరుగులు పిండుకుంది. కెమరోన్ గ్రీన్ రెండు భారీ సిక్సర్లు సాధించాడు. స్ట్రాటజిక్ బ్రేక్ తర్వాత చాలా మంది బ్యాటర్లు ఔటవ్వడం ఈ ఐపీఎల్ టోర్నీలో తరచుగా జరుగుతోంది. జోరుమీదున్న రోహిత్ శర్మ కూడా స్ట్రాటజిక్ బ్రేక్ తర్వాత ఔటయ్యాడు. 56 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.
సూర్యకుమార్ ఎంట్రీ
రోహిత్ శర్మ ఔటైన తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కెమరున్ గ్రీన్‌కు చక్కని సహకారం అందించాడు. వీరిద్దరూ ఎటువంటి పొరపాట్లు చేయకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో నాల్గవ స్థానంలో నిలిచింది.
📸💯#TATAIPL | #MIvSRH pic.twitter.com/HjPALv94Qr
— IndianPremierLeague (@IPL) May 21, 2023
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗖𝗛𝗔𝗦𝗘!@mipaltan stay alive in #TATAIPL 2023 courtesy of an exceptional batting display and an 8-wicket win over #SRH 👏🏻👏🏻#MIvSRH pic.twitter.com/t1qXyVbkqG
— IndianPremierLeague (@IPL) May 21, 2023
𝙂𝙡𝙤𝙧𝙞𝙤𝙪𝙨 𝙂𝙧𝙚𝙚𝙣!
How good was that knock in the chase 🙌
Relive that 💯 moment here 🔽 #TATAIPL | #MIvSRH pic.twitter.com/ZugNklUFKI
— IndianPremierLeague (@IPL) May 21, 2023