WPL Rcb vs Mi: బెంగళూరు పై ముంబై ఇండియన్స్ విజయం
WPL Rcb vs Mi: ముంబై ఇండియన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. లీగ్ ఆరంభ పోరులో గుజరాత్‌పై భారీ విజయం నమోదు చేసుకున్న ముంబై.. సోమవారం జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై గెలుపొందింది. వరుస దూకుడును ప్రదర్శిస్తుంది ముంబై ఇండియన్స్ జట్టు. తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ను చిత్తు చేసిన ముంబయి ఈ సారి బెంగళూరుకు చెమటలు పట్టించింది.
బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై 9 వికెట్ల తేడాతో భారీ సక్సెస్‌ను అందుకుంది. బెంగళూరు నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఓ వికెట్ కోల్పోయి 14.2 ఓవర్లలో ఛేదించింది. ముంబయి ఓపెనర్ హేలీ మ్యాథ్యూస్ 77 , న్యాట్ స్క్రైవర్ బ్రంట్ 55 అర్థశతకాలతో చెలరేగి తమ జట్టుకు అద్బుత గెలుపును అందించారు. ఐదో ఓవర్లో ఓపెనర్ యాస్తిక భాటియాను 23 పరుగుల వద్ద ప్రీతి బోస్ ఎల్బీగా వెనక్కి పంపింది. ఈ వికెట్ మినహా బెంగళూరు ఖాతాలో మరో వికెట్ పడలేదు. హేలీ మాథ్యూస్ 38 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్ తో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. నాట్ షివర్ 29 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్ తో 55 పరుగులు చేసింది.
ముందు బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓ మోస్తరు పరుగులు చేసి 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ రిచా ఘోష్ 28 , స్మృతి మంధాన 23 అత్యధిక పరుగులు సాధించారు. బెంగుళూర్ బ్యాటర్లలో ఒక్కరు 30కి పైగా పరుగులు చేయకపోవడం గమనార్హం. మహిళల ప్రీమియర్ లీగ్‌లో బెంగళూరు జట్టుకు ఇది రెండో ఓటమి.