తాజాగా గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడాడు. తాను 360 డిగ్రీస్ ప్లేయర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. మెరుపు వేగంతో సెంచరీ సాధించాడు. 49 బంతుల్లో 103 పరుగులు చేశాడు. సూర్య ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు 6 సిక్సర్లు ఉన్నాయి
Mumbai Indians Scored 218 runs against Gujarat Titans
ముంబై జట్టు చెలరేగి ఆడుతోంది. టోర్నమెంట్ చివరి దశకు చేరుకుంటున్న సమయంలో వీరవిహారం చేస్తోంది. సూర్యకుమార్ యాదవ్ తిరిగి ఫామ్లోకి వచ్చిన తర్వాత ముంబై జట్టు పుంజుకుంది. వరుస విజయాలు సాధిస్తోంది. మంచి ఊపు కనబరుస్తోంది. తాజాగా గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడాడు. తాను 360 డిగ్రీస్ ప్లేయర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. మెరుపు వేగంతో సెంచరీ సాధించాడు.
49 బంతుల్లో 103 పరుగులు
ఓపెనర్ రోహిత్ శర్మ ఔటైన తర్వాత బరిలో దిగిన సూర్య చివరి వరకు నిలిచాడు. చివరి బంతికి సిక్సర్ కొట్టడం ద్వారా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 49 బంతుల్లో 103 పరుగులు చేశాడు. సూర్య ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు 6 సిక్సర్లు ఉన్నాయి.
20 ఓవర్లలో 218 పరుగులు
ఓపెనర్లు ఇషాన్ కిషన్ 31 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 29 పరుగులు చేశాడు. మిడిలార్డర్ బ్యాటర్ విష్ణు వినోద్ కూడా 30 పరుగులు సాధించాడు. దీంతో ముంబై జట్టు 218 పరుగులు చేయగలిగింది. గుజరాత్ ముందు 219 పరుగుల టార్గెట్ ఉంచింది. గుజరాత్ బౌలర్లలో రషద్ ఖాన్ మినహా మిగతా బౌలర్లకు చుక్కలు కనిపించాయి. రషీద్ ఖాన్ ఒక్కడే 4 వికెట్లు పడగొట్టాడు.
ICONIC!
This is what Surya Kumar Yadav has earned. Respect. 👑❤️ pic.twitter.com/ujnOoRIz0d
— ANSHUMAN🚩 (@AvengerReturns) May 12, 2023
Bow down to The king Surya Kumar Yadav!!🔥🔥
Another Fifty For the GOAT!
GOAT of T20I!!🔥#MIvGT pic.twitter.com/GuUhCDhotZ
— ᴘʀᴀᴛʜᴍᴇsʜ⁴⁵ (@45Fan_Prathmesh) May 12, 2023
Another day to thank god for Surya Kumar Yadav. pic.twitter.com/MqmZKFFgPU
— R A T N I S H (@LoyalSachinFan) May 12, 2023