Mumbai Indians scored 182 runs against LSG
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్లో తొలిత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది. ముంబై జట్టులో కనీసం ఒక్క ఆటగాడు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. కెమరున్ గ్రీన్ చేసిన 41 పరుగులే జట్టులో అత్యధిక స్కోర్ కావడం విశేషం. సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులు చేయగా, తిలక్ వర్మ 26 పరుగులు చేశాడు. చివర్లో వచ్చిన నేహాల్ వధేరా లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 2 ఫోర్లు 2 సిక్సర్లు బాదాడు. 12 బంతుల్లో 23 పరుగులు చేశాడు.
టాస్ గెలిచిన ముంబై జట్టు మొదటి బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మలు జట్టుకు భారీ స్కోర్ అందించలేకపోయారు. రోహిత్ శర్మ 11 పరుగుల వద్ద, ఇషాన్ కిషన్ 15 పరుగుల వద్ద ఔటయ్యారు. దీంతో జట్టు స్కోర్ పెంచే బాధ్యత మిడిలార్డర్ బ్యాటర్లపై పడింది. గత మ్యాచ్లో సెంచరీ సాధించిన కెమరున్ గ్రీన్ అదే జోరు కనబరిచాడు. 23 బంతుల్లో 41 పరుగులు చేశాడు. 6 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు.
ముంబై జోరుకు నవీన్ అడ్డకట్ట
లక్నో బౌలర్ నవీన్ ఉల్హక్ 4 వికెట్లు పడగొట్టాడు. రోహిత్ శర్మ, కెమరున్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మల వికెట్లు దక్కించుకున్నాడు. నవీన్ ముంబై బ్యాటర్లకు అడ్డకట్టవేయకపోతే ఆ జట్టు స్కోర్ 200 పరుగులు దాటి ఉండేది.
Innings Break!
The Mumbai Indians finish with a challenging total of 182/8 on board 👌🏻👌🏻
An exciting chase on the cards. Who do you reckon is ahead in the #Eliminator?
Follow the match ▶️ https://t.co/CVo5K1wG31#TATAIPL | #LSGvMI pic.twitter.com/sv38cEu2G5
— IndianPremierLeague (@IPL) May 24, 2023