ముంబై పేసర్ ఆకాశ్ మధ్వాల్ రాత్రికి రాత్రే హీరోగా మారిపోయాడు. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీయడం ద్వారా క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఎవరికీ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు.
Mumbai Indians Pacer Akash Madhwal took 5 Wkts against LSG
ముంబై పేసర్ ఆకాశ్ మధ్వాల్ రాత్రికి రాత్రే హీరోగా మారిపోయాడు. లక్నో జట్టుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 5 వికెట్లు తీయడం ద్వారా క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఎవరికీ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ ప్లే ఆఫ్ దశలో 5 పరుగులకే 5 వికెట్లు పడగొట్టిన మొట్టమొదటి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
మధ్వాల్ మెరుపులు
ముంబై జట్టు ఆడిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కూడా మధ్వాల్ మెరుపులు మెరిపించాడు. సన్‌రైజర్స్ జట్టు జోరుకు బ్రేక్ వేశాడు. ఆ జట్టు భారీ స్కోర్ చేయకుండా నిలువరించగలిగాడు. మే 21న జరిగిన ఆ మ్యాచ్‌లో మధ్వాల్ 4 వికెట్లు పడగొట్టాడు. వివ్రాంత్ శర్మ, మయాంక్ అగర్వాల్, క్లాసెన్, హారీ బ్రూక్ వంటి స్టార్ ప్లేయర్లను పెవిలియన్ పంపారు. ముంబై జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ముంబై జట్టు ప్లే ఆఫ్ దశకు చేరుకుంది.
మే 24న చెన్నైలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో ఘోరంగా ఓడిపోయింది. ముంబై చేతిలో పరాజయం పాలయింది. 101 భారీ తేడాతో ఓటమిని ఎదుర్కొంది. టార్గెట్ రీచ్ కాలేక చతికిల పడింది. అత్యంత చెత్త ప్రదర్శన ద్వారా టోర్నీ నుంచి వైదొలిగింది. ఆకాశ్ మధ్వాల్ 5 కీలక వికెట్లు తీయడం ద్వారా లక్నో జట్టు ఘోర పరాజయానికి ప్రధాన కారకుడిగా నిలిచాడు.
ఐపీఎల్ ప్లే ఆఫ్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన
5 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం అనేది ఐపీఎల్ చరిత్రలో ఇది రెండవ సారి. గతంలో భారత దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే ఈ ఫీట్ సాధించాడు. ఆ ఫీట్ ఓ లీగ్ మ్యాచ్‌లో కుంబ్లే సాధించాడు. ప్లే ఆఫ్ దశలో 5 పరుగులకు 5 వికెట్లు సాధించిన తొలి ప్లేయర్‌గా ఆకాశ్ మధ్వాల్ రికార్డు క్రియేట్ చేశాడు.
నెట్ బౌలర్ 2 మ్యాచ్ విన్నర్
ఆకాశ్ మధ్వాల్‌కు 2019 నుంచి ఐపీఎల్‌తో అనుబంధం ఉంది. బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఆకాశ్ మధ్వాల్‌ను నెట్ బౌలర్‌గా వాడుకుంది. ఆ ఏడాది ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. దీంతో నిరాశ చెందిన మధ్వాల్ సరైన అవకాశం కోసం ఎదురుచూశాడు. గత ఏడాది సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు. ఆ సమయంలో ఆకాశ్ మధ్వాల్ ఛాన్స్ దక్కించుకున్నాడు. గత ఏడాది ముంబై జట్టులో ప్రవేశించాడు. ఎక్కువ మ్యాచులు ఆడే అవకాశం లభించలేదు. ఈ ఏడాది వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగపరుచుకుంటున్నాడు. బుమ్రా లేని లోటు తీర్చాడని అనేక మంది క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Sensational! 🔥🔥
Akash Madhwal bags a FIFER & Lucknow Super Giants are all out for 101 #TATAIPL | #Eliminator | #LSGvMI pic.twitter.com/pfiLNkScnz
— IndianPremierLeague (@IPL) May 24, 2023
It's all happening in Chennai!
That's the third run-out in the second innings and Mumbai Indians are just 1 wicket away from a big win 🙌
Follow the match ▶️ https://t.co/CVo5K1wG31#TATAIPL | #Eliminator | #LSGvMI pic.twitter.com/dUAGJ3dgjm
— IndianPremierLeague (@IPL) May 24, 2023
The leap of JOY when you get two in two 😉
Akash Madhwal has turned things around for Mumbai Indians! #TATAIPL | #Eliminator | #LSGvMI pic.twitter.com/A70nMyLWuN
— IndianPremierLeague (@IPL) May 24, 2023
Akash Madhwal's coach said," After the SRH game, when I spoke to Akash, he only talked about Rohit Sharma and how he has helped him in the last two months, He said his 50% performance in this years is due to his Rohit Bhaiya". [Indian Express] pic.twitter.com/6gkDyLrCLC
— Vishal. (@SPORTYVISHAL) May 25, 2023