ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. ముంబై బౌలర్ ఆకాష్ మధ్వాల్ అద్భుతంగా రాణించి ఐదు వికెట్లతో లక్నో బ్యాటింగ్ లైనప్ ను దెబ్బ తీయడంతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై ముంబై ఇండియన్స్ ఘనవిజయం సాధించింది.
LSG vs MI: ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. ముంబై బౌలర్ ఆకాష్ మధ్వాల్ అద్భుతంగా రాణించి ఐదు వికెట్లతో లక్నో బ్యాటింగ్ లైనప్ ను దెబ్బ తీయడంతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై ముంబై ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. మరో ముగ్గురు లక్నో ఆటగాళ్ళు రనౌట్ గా వెనుదిరగడం విశేషం. చెపాక్ స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ పోరులో ముంబయి ఇండియన్స్ 81 పరుగుల భారీ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ను చిత్తు చేసింది. 183 పరుగుల లక్ష్యఛేదనలో ఏ దశలోనూ గెలుపు దిశగా సాగుతున్నట్టు కనిపించని లక్నో జట్టు 16.3 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది.
ముంబై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కామెరూన్ గ్రీన్-41, సూర్య కుమార్ యాదవ్,33; తిలక్ వర్మ,26; నేహాల్ వధేరా,23 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు దిగిన ముంబైని కట్టడి చేయడంలో లక్నో బౌలర్లు నవీన్ ఉల్ హక్ యష్ ఠాకూర్ లు సూపర్ సక్సెస్ అయ్యారు. ఆరంభంలో స్లోగా బ్యాటింగ్ మొదలుపెట్టిన రోహిత్ 11 ను నాలుగో ఓవర్లోనే నవీన్ పెవిలియన్‌కు పంపాడు.
ఛేజింగ్‌లో లక్నోకు సరైన ఆరంభం లభించలేదు. రెండో ఓవర్లో ప్రేరక్ మన్కడ్ 3 ఔట్‌తో మొదలైన పతనం వేగంగా సాగింది. ఓ దశలో స్టోయినిస్ ఒంటరి పోరాటం చేసినా.. ఆకాశ్ మద్వాల్ సూపర్ బౌలింగ్‌తో దెబ్బకొట్టాడు. లక్నో ఇన్నింగ్స్ లో ముగ్గురు బ్యాట్స్ మెన్ రనౌట్ కావడం లక్నో జట్టు ఆటగాళ్ల మధ్య సమన్వయ లేమిని ఎత్తిచూపింది. మొదట్లోనే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మార్కస్ స్టొయినిస్ 27 బంతుల్లో 40 పరుగులు చేసినా, చివరికి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. 12వ ఓవర్లో స్టోయినిస్ రనౌట్‌తో మ్యాచ్ కీలక మలుపు తీసుకుంది. తర్వాతి ఓవర్లో కృష్ణప్ప గౌతమ్ (2) రనౌట్ కావడంతో 92 పరుగులవద్ద ఎదురీత మొదలుపెట్టింది. 15వ ఓవర్లో మద్వాల్ వరుసగా రెండువికెట్లు పడగొట్టడంతో మరింత కష్టాల్లో పడింది. ఇక 30 బాల్స్‌లో 83 రన్స్ చేయాల్సిన దశలో మద్వాల్.. మోషిన్ ఖాన్ డకౌట్ ఔట్ చేసి లక్నో సూపర్ జెయింట్స్ ని ఇంటిబాట పట్టించాడు. 16.3 ఓవర్లలో 101 పరుగులకే లక్నో ఆలౌట్ అయ్యింది.