అంపైర్లతో గొడవ ధోనికి పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. ధోనిపై ఒక మ్యాచ్ నిషేధం పడితే ఫైనల్లో చెన్నై జట్టుకు కష్టాలు తప్పవు
IPL Updates : ఐపీఎల్(IPL) ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ కు(Chennai Super Kings) షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్‌ని ఓడించి.. చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్స్‌కు చేరింది. అయితే సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ(Dhoni) అంపైర్లతో వాగ్వాదాని దిగడమే ఇందుక కారణమని తెలుస్తోంది. మంగళవారం జరిగిన మ్యాచ్ లో అంపైర్లతో ధోనీ వాగ్వాదానికి దిగి, 4 నిమిషాల సమయాన్ని వృథా చేశాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న మ్యాచ్ రెఫరీ ధోనిపై యాక్షన్ తీసుకునే అవకాశాలు పరిశీలిస్తున్నాడు. ఈ వ్యవహారంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా ఆరా తీస్తోంది. దీంతో ధోనికి భారీ జరిమానా లేదా, ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశాలున్నాయి. జరిమానా విధిస్తే ఇబ్బందేమీ ఉండకపోవచు కానీ, నిషేధం విధిస్తే మాత్రం, ఫైనల్స్ ధోనీ ఆడే ఛాన్సుండదు. ఇది సీఎస్కేకు పెద్ద దెబ్బే.
అసలేం జరిగింది..
సీఎస్కే బౌలర్ మతీషా పాతిరానా 16వ ఓవర్ వేసేందుకు సిద్ధమవుతుండగా, ఫీల్డ్ అంపైర్లు అందుకు అంగీకరించలేదు. అందుకు కారణం.. అతడు ఈ ఓవర్ వేసే ముందు 9 నిమిషాల పాటు మైదానంలోనే లేడు. నేరుగా డగౌట్ నుంచి బౌలింగ్ వేయడానికి వచ్చాడు. రూల్స్ ప్రకారం.. మైదానంలో లేకుండా, అలా నేరుగా వచ్చి బౌలింగ్ వేయడానికి వీలు లేదు. అందుకే, ఫీల్డ్ అంపైర్లు అతడ్ని అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ధోనీ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. ఫైనల్‌గా అతడు అంపైర్లను ఒప్పించగలిగాడు కానీ, వారితో వాగ్వాదానికి దిగడంతో పాటు 4 నిమిషాల సమయాన్ని వృధా చేయడమే ధోనీని ఇబ్బందుల్లోకి నెట్టింది.