ముంబైతో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. 62 పరుగుల తేడాతో గెలిచింది. దర్జాగా ఫైనల్ చేరింది. తుది పోరులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించిన హార్ధిక్ సేన వరుసగా రెండోసారి ఐపీఎల్ ఫైనల్ చేరింది
Mohit Sharma took 5 Wickets against Mumbai
ముంబైతో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. 62 పరుగుల తేడాతో గెలిచింది. దర్జాగా ఫైనల్ చేరింది. తుది పోరులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించిన హార్ధిక్ సేన వరుసగా రెండోసారి ఐపీఎల్ ఫైనల్ చేరింది. ముంబై జట్టు లక్ష్యఛేదనలో తడబడింది. ఇంటిదారి పట్టింది.
మోహిత్ మెరుపులు, టపటపా రాలిన ముంబై వికెట్లు
గుజరాత్ ఘన విజయంలో ఇద్దరు ప్లేయర్లు కీలకంగా వ్యవహరించారు. బ్యాటింగ్ విభాగంలో శుభ్‌మన్ గిల్ తడాఖా చూపిస్తే, బౌలింగ్ విభాగంగా మోహిత్ శర్మ ఇరగదీశాడు. 5 కీలక వికెట్లు పడగొట్టాడు. 71 పరుగులకు కేవలం 2 వికెట్లు కోల్పోయిన ముంబై జట్టు 171 పరుగులకు ఆలౌట్ అయింది. అంటే 100 పరుగలకు మిగతా 8 వికెట్లు సమర్పించుకుంది.
సూర్యకుమార్ యాదవ్ బరిలో ఉన్నంతసేపు పటిష్టంగా కనిపించిన ముంబై ఆ తర్వాత పేకమేడలా కూలిపోయింది. జట్టు స్కోర్ 155 పరుగుల వద్ద ఉన్నప్పుడు సూర్యకుమార్ ఔటయ్యాడు. 5వ వికెట్‌గా నిష్క్రమించాడు. అక్కడి నుంచి వికెట్లు టపటపా రాలిపోయాయి. సూర్య కుమార్ యాదవ్ తర్వాత ఆడిన ఐదుగురు ఆటగాళ్లు కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. చేతులెత్తేశారు.
లీగ్ స్టేజ్‌లో సత్తాచాటిన విష్ణు వినోద్, టిమ్ డేవిడ్ లాంటి హిట్టర్లు కూడా గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ ధాటిని తట్టుకోలేకపోయారు. చివరి ఆరు వికెట్లలో ఐదు వికెట్లు మోహిత్ శర్మ దక్కించుకున్నాడు. ముంబై పరాజయాన్ని ఖాయం చేశాడు.
జోరు మీదున్న సూర్యకుమార్ యాదవ్‌ను 61 పరుగుల వద్ద ఔట్ చేసిన మోహిత్ శర్మ, అక్కడి నుంచి వికెట్ల వేట మొదలు పెట్టాడు. విష్ణు వినోద్, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, కుమార కార్తీకేయ వికెట్లు పడగొట్టాడు. భళా మోహిత్ అనిపించుకున్నాడు.
వరుసగా రెండు సార్లు ఐపీఎల్ ఫైనల్ చేరిన మూడో జట్టుగా గుజరాత్ టైటాన్స్ రికార్డు క్రియేట్ చేసింది. గతంలో ముంబై ఇండియన్స్ జట్టు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఆ ఫీట్ సాధించాయి.
What a phenomenal victory by @gujarat_titans! 🙌 Their remarkable teamwork and unwavering fighting spirit have got them into the finals! 🏏💪 Hats off to @imohitsharma18 for his incredible performance and taking down 5 wickets! 🔥 Congratulation to whole team! #IPL2023 #MIvGT pic.twitter.com/C0nCNLQZim
— Suresh Raina🇮🇳 (@ImRaina) May 26, 2023
Another example of Never Give Up- Mohit Sharma. Was not in the fray last few seasons and a net bowler for GT last season. But in just 13 matches, 24 wickets this season is a champion performance. Top 3 wicket takers all from Gujarat and they so deserve to make it to the finals.… pic.twitter.com/cJ6VxMMSZu
— Virender Sehwag (@virendersehwag) May 26, 2023
Unsold in IPL 2022.
5 for 10 in the Qualifier 2 in IPL 2023.
Mohit Sharma has written one of the great comeback stories in IPL history. pic.twitter.com/nXXhjA8xRh
— Johns. (@CricCrazyJohns) May 26, 2023