BCCI: మహిళా ఐపీఎల్ బేస్ ప్రైజ్ దాదాపుగా ఖరారు, త్వరలోనే అధికారిక ప్రకటన
Major boost for Women’s IPL, base price of franchises set at INR 400 Cr
మహిళా ఐపీఎల్ నిర్వహణకు జరగాల్సిన పనులు ఒక్కక్కటిగా జరుగుతున్నాయి. ఐపీఎల్ ప్రాంచైజీల బేస్ ప్రైజ్‌ను బీసీసీఐ దాదాపుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. రూ.400 కోట్లు బేస్ ప్రైజ్ ఉండనున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మహిళా టీ 20 వరల్డ్ కప్ జరగనుంది. అది ముగియగానే ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఐదు ప్రాంచైజీలు తొలి ఐపీఎల్‌లో పాల్గోనున్నాయి. మహిళా ఐపీఎల్‌కు ఉండనున్న ఆదరణను పరిగణలోకి తీసుకుని అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
2008లో ఐపీఎల్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ 446 కోట్లకు కొనుగోలు చేసింది.
ఒక్కక్క ఐపీఎల్ ఫ్రాంచైజీల నుంచి దాదాపుగా 1000 నుంచి 1500 కోట్ల రూపాయల వరకు ఆర్జించే అవకాశం ఉన్నట్లు కూడా బీసీసీఐ అంచనా వేసింది. బీసీసీఐ అంచనాల ప్రకారం అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏకంగా 5000 నుంచి 7000 కోట్ల రూపాయలు క్రికెట్ బోర్డు ఖజానాకు చేరనున్నాయి.
మహిళా ఐపీఎల్‌లో మొత్తం 22 మ్యాచులు జరగనున్నాయి. ప్రతి ఫ్రాంచైజీలో 18 మంది ప్లేయర్లకు ఛాన్స్ ఉంది. అందులో ఆరుగురు విదేశీ ప్లేయర్లకు అవకాశం ఉంటుంది. ఆరుగురిలో ఐదుగురిని మ్యాచ్‌లో ఆడించేందుకు అవకాశం కల్పిస్తారు.
ఫ్రాంచైజీల టెండర్ కార్యక్రమం కూడా త్వరలోనే జరగనుంది. ఈ ఆక్షన్ ద్వారా ఫ్రాంచైజీల కేటాయింపు జరగనుంది. ఈ ఆక్షన్ ఎప్పుడు జరగనుందనే విషయంలో ఇంకా క్లారిటీ రావలసి ఉంది. పురుషుల ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా ఈ ఆక్షన్‌లో పాల్గొనే అవకాశాలున్నాయి.