IPL LSG Vs MI: ఐపీఎల్ సమరం కీలక దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్ స్థానాల కోసం పోరాటం సాగుతోంది. రోజు రోజుకీ స్థానాలు మారిపోతున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో బెర్తు ఖాయం చేసుకొనేందుకు ముంబాయి వర్సస్ లక్నో కీలక మ్యాచ్ జరగనుంది. రెండు జట్లలోనూ సమర్ధవంతమైన ఆటగాళ్లతో ఈ టోర్నీలో తొలి వరుసలోకి వచ్చాయి. చివరి దశలో ఉన్న మ్యాచ్ ల్లో వస్తున్న ఫలితాలతో టీంల స్థానాలు మారిపోతున్నాయి. దీంతో, ప్రతీ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కేఎల్ రాహుల్ దూరం కావటంతో క్రునాల్ పాండ్యా నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. రోహిత్ సేన తమ విజయాలను కొనసాగించాలని భావిస్తోంది.
ముంబాయి, లక్నో మధ్య రెండు మ్యాచ్ లు జరగ్గా రెండింటా లక్నో విజయం సాధించింది.పాయింట్ల పట్టికలో ముంబాయి మూడో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 12 మ్యాచ్ లు ఆడిన మంబాయి ఏడు గెలవగా, 5 ఓడిపోయింది. 14 పాయింట్లతో మైనస్ 0.117 రన్ రేట్ తో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో గెలవటం ద్వారా తొలి నాలుగు స్థానాల్లో ఖాయంగా కొనసాగే అవకాశాలు మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది. లక్నో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 12 మ్యాచ్ లు ఆడిన లక్నో 6 గెలవగా 5 ఓడింది. ఒక మ్యాచ్ లో ఫలితం రాకపోవటంతో 1 పాయింట్ దక్కించుకుంది. 0.309 రన్ రేటుతో నిలిచింది. వెనుక ఆర్సీబీ ఉండటంతో మిగిలిన టీంల ఫలితాలు ఈ రెండు టీంల పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది.
ముంబాయిలో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, వధేరా, వినోద్ బ్యాటింగ్ లో ఫాంలో కొనసాగటం టీంకు కలిసొచ్చే అంశం. అదే విధంగా లక్నో టీంలో మేయర్స్, మన్కడ్, స్టోయినస్, నిఖోలస్ పూరన్ సక్సెస్ అయితే టీంకు ఇబ్బంది లేనట్లే. దీంతో, ఈ మ్యాచ్ కోసం ముంబాయి ఇండియన్స్ నుంచి ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, వధేరా, కెమరన్ గ్రీన్, విష్ణు వినోద్, టిం డేవిడ్, జోర్డాన్, పీయూష్ చావ్లా బెహన్డ్రూఫ్, కార్తికేయ, ఆకాశ్ మధ్వాల్, జాన్ సెన్, అర్షద్ ఖాన్ ఎంపికయ్యే అవకాశం ఉంది.లక్నో టీం నుంచి డికాక్, క్రుణాల్ పాండ్యా, మేయర్స్, మన్కడ్, స్టోయినిస్, నిఖోలస్ పూరన్, రవి బిష్ణోయ్, యద్వీర్, ఆవేష్ ఖాన్, బదోని, నవీన్ ఉల్ హక్ కు ఛాన్స్ దక్కనుంది. ఈ మ్యాచ్ లో టాస్ కీలకం కానుంది.