గవాస్కర్ షర్ట్ పై ధోనీ ఆటోగ్రాఫ్
Dhoni Gavaskar : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) అంటే పడి చచ్చిపోతారు ఫ్యాన్స్. ఆ అభిమానం ఫ్యాన్స్ వరకే పరిమితం కాదు.. మాజీ క్రికెటర్లు సైతం ధోని నాయకత్వం ,పోరాట పటిమ చూసి ముచ్చట పడతారు. టీమిండియా ఒకప్పటి లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్‌కు (Sunil Gavaskar) కూడా ధోనీ అంటే చాలా ఇష్టం. ఆదివారం ఐపీఎల్ మ్యాచ్‌లో ధోనీ అంటే తనకెంత ఇష్టమో చాటుకున్నాడు గవాస్కర్. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ (CSKvsKKR) మధ్య ఈ అరుదైన దృశం చోటు చేసుకుంది.
మ్యాచ్ అయ్యాక సునీల్ గవాస్కర్ నేరుగా మైదానంలో ఉన్న ధోనీ దగ్గరకు వెళ్లి ఆటోగ్రాఫ్ (Autograph)అడిగాడు. దీంతో ధోనీ గవాస్కర్ షర్ట్ (Shirt)పై సంతకం చేశాడు (Sunil Gavaskar gets Dhoni autograph). అనంతరం ధోనీని గవాస్కర్ మనస్ఫూర్తిగా హత్తుకున్నాడు. “ధోనీని ఇష్టపడని వారు ఎవరు? అతను భారత క్రికెట్‌కు చేసిన సేవలను ఎవరు మర్చిపోగలరు? అతను ఎంతో మంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తి. ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకోవడం కోసం నేను పెన్ను అప్పుగా తీసుకున్నాన“ని గవాస్కర్ అన్నాడు.