Kohli cried after RCB loss in last league Match
విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్ టోర్నీలో వీరవిహారం చేశాడు. రెండు సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు చేశాడు. పరుగులు వరద పారించాడు. ఎంత చేసినా తన జట్టును ప్లే ఆఫ్ దశకు చేర్చలేకపోయాడు. గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓటమి ఎదురుకావడంతో బెంగళూర్ జట్టు ప్లే ఆఫ్ చేరలేకపోయింది. దీంతో విరాట్ కోహ్లీ తీవ్రంగా కలత చెందాడు. కన్నీటి పర్యంతమయ్యాడు.
చివరి లీగ్ మ్యాచ్లో అద్భుతమైన ఆటతీరుతో అలరించిన కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోర్ 197 పరుగులకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఎన్ని చేసినా జట్టులోని ఇతర ఆటగాళ్ల నుంచి సరైన సహకారం లేకపోవడంతో బెంగళూర్ జట్టుకు ఓటమి తప్పలేదు.
కోహ్లీ సెంచరీ చేసే సమయంలో స్లేడియంలో ఉన్న భార్య అనుష్క శర్మ ముద్దులతో ముంచెత్తింది. తన భర్త బ్యాటింగ్ విన్యాసానికి ఎంతో ముచ్చట పడింది. ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. గుజరాత్ బ్యాటర్ శుభ్మన్ గిల్ బెంగళూర్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఒంటిచేత్తో గుజరాత్ జట్టును గెలిపించాడు. చివరి వరకు నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ ఐపీఎల్ సీజన్లో రెండో సెంచరీ సాధించాడు.
2016లో జరిగిన ఐపీఎల్ టోర్నీలో నాలుగు సెంచరీలు చేసిన కోహ్లీ ఆ ఏడాది కూడా జట్టుకు టైటిల్ అందించలేకపోయాడు. ఈ ఏడాది కనీసం ప్లే ఆఫ్ దశకు కూడా బెంగళూర్ జట్టు చేరలేకపోయింది. 2008 నుంచి ఐపీఎల్ టోర్నీలో కీలక జట్టుగా ఉన్న బెంగళూర్ జట్టు టైటిల్ వేటలో మాత్రం అందరికంటే వెనకబడి ఉంది. ఐపీఎల్ టోర్నీ ప్రారంభమై 2008 నుంచి ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా నెగ్గలేకపోయింది.
Anushka Sharma's flying kiss to Virat Kohli when he completed his Hundred. pic.twitter.com/nwWRH9r4MK
— CricketMAN2 (@ImTanujSingh) May 21, 2023
..