వరుస విజయాలతో జోరుమీదున్న చెన్నై సూపర్ కింగ్స్ నేడు జరిగే కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే చెన్నై నేరుగా ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తోంది.
IPL2023: వరుస విజయాలతో జోరుమీదున్న చెన్నై సూపర్ కింగ్స్ నేడు జరిగే కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే చెన్నై నేరుగా ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తోంది. ఢిల్లీ ఇప్పటికే నాకౌట్ రేసు నుంచి వైదొలిగింది. ఈ మ్యాచ్‌లో గెలిచినా ఓడినా ఢిల్లీకి కలిసివచ్చే అంశమేదీ ఉండదు. చెన్నైకి మాత్రం ఈ మ్యాచ్ కీలకం. ఇందులో గెలిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తోంది. ప్రస్తుతం చెన్నై 15 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఢిల్లీ కింది నుంచి రెండో స్థానంలో నిలిచింది.
దాదాపు ప్రతి మ్యాచ్‌లో ఓపెనర్లు డెవోన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్‌లు అద్భుత ఫామ్‌లో రాణిస్తున్నారు. అంబటి రాయుడు, శివమ్ దూబే, మోయిన్ అలీ, జడేజా, ధోనీలతో చెన్నై బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక తీక్షణ, పతిరణ, తుషార్, దీపక్, జడేజా, మోయిన్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. దీంతో చెన్నై ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఢిల్లీ కూడా చివరి మ్యాచ్‌లో గెలిచి సీజన్‌ను ముగించాలనే పట్టుదలతో ఉంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది.
మరో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ లక్నోతో బరిలోకి దినుంది. ప్లేఆఫ్ రేసులో లక్నో నిలవాలంటే.. కోల్‌కతాపై గెలవాల్సి ఉంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక లక్నో 15 పాయింట్లతో ముందంజలోఉంది. కోల్‌కతా తో లక్నో గెలిస్తే అది 17 పాయింట్ లతో ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది. ఇక కోల్‌కతా ఖాతాలో 14 పాయింట్స్ తో ఉంది ఇది రన్ రేట్ మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 13 మ్యాచ్‌లలో 7 మ్యాచ్‌లు గెలిచింది, 5 మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఒక మ్యాచ్‌లో ఫలితం చూడలేదు. ప్లేఆఫ్ రేసులో లక్నో నిలవాలంటే.. తప్పకుండ కోల్‌కతాపై గెలవాల్సి ఉంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. మరి ఈ ఉత్కంఠ పోరులో గెలుపు ఎవరిదో చూడాలి.