ఐపీఎల్ 2023లో నేడు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో 65వ మ్యాచ్ జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో తలపడనుంది.
IPL2023 RCB Vs SRH: ఐపీఎల్ 2023లో నేడు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో 65వ మ్యాచ్ జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో తలపడనుంది. సన్‌రైజర్స్ ఇప్పటివరకు 12 గేమ్‌లలో నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ 12 మ్యాచ్‌లలో ఆరు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మరోవైపు సన్‌రైజర్స్ ఇప్పటికే ప్లేఆఫ్‌ల రేసు నుంచి నిష్క్రమించింది. కానీ రాయల్ ఛాలెంజర్స్ ప్లేఆఫ్‌లకు చేరుకోవడానికి తప్పనిసరిగా రెండు మ్యాచ్‌లను గెలవాలి. రా. 7.30 నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఈరోజు జరగనున్న మ్యాచ్ బెంగళూరు టీం గెలుస్తుందా లేదా అని ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇంకోవైపు సన్ రైజర్స్ కూడా హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్ గెలవాలని చూస్తోంది. తమ చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సిన పరిస్థితిలో ఉన్న బెంగళూరు.. సన్‌రైజర్స్‌పై భారీ విజయం సాధించాలని చూస్తోంది. ఈ పోరులో అందరి కండ్లూ విరాట్ పైనే ఉండనున్నాయి. కెప్టెన్ డుప్లెసిస్‌తో పాటు ఆర్సీబీ టాప్ స్కోరర్‌గా ఉన్న విరాట్ గత రెండు మ్యాచ్‌ల్లో ఫెయిలయ్యాడు. ఈ నేపథ్యంలో తనకు మంచి రికార్డున్న ఉప్పల్ స్టేడియంలో రెచ్చిపోవాలని చూస్తున్నాడు. IPL చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్, సన్ రైజర్స్ 22 సార్లు తలపడ్డాయి. ఆ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ తొమ్మిది మ్యాచ్‌లలో విజేతగా నిలిచింది. అయితే సన్ రైజర్స్ 12 గేమ్‌లలో విజయాన్ని సాధించింది. కాగా నేటి మ్యాచ్ లో ఎవరువిజయకేతనం ఎగురవేస్తారో చూడాలి.
ఇక ప్లేఆఫ్స్‌కు ఎవరు క్వాలిఫై అవుతారనేది మ్యాచ్ మ్యాచ్‌కు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ 13 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో ప్లేఆఫ్స్‌కు అధికారికంగా అర్హత సాధించింది. అయితే మిగిలిన మూడు బెర్త్‌ల కోసం చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ టీమ్స్ ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవ్వాలంటే తదుపరి ఆడబోయే మ్యాచ్‌లు తప్పక గెలవాల్సి ఉంటుంది. మొన్నటి వరకు ప్లేఆఫ్స్ రేసులో దూసుకెళ్తున్న ముంబై ఇండియన్స్ పంజాబ్ పై పోరాడి ఒడి పోయి ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు చేసుకుంది.