IPL2022: మరి కాసేపట్లో ఢిల్లీ-లక్నో జట్ల మధ్య మ్యాచ్
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇవాళ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మరి కాసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుండగా.. సాయంత్రం సన్ రైజర్స్ హైదరాబాద్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 8 మ్యాచ్‌లు ఆడగా అందులో 4 విజయాలు సాధించింది. 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో టాప్ 6లో ఉంది. మరోవైపు లక్నో జట్టు ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడగా అందులో 6 విజయాలు నమోదు చేసింది. 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో టాప్ 3లో ఉంది. ఈ మ్యాచ్‌లో లక్నో టీం విజయం సాధిస్తే టాప్ 1కు దూసుకువెళ్లే ఛాన్స్ ఉంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధిస్తే 10 పాయింట్లతో టాప్ 5 చేరుకునే అవకాశం ఉంది.