IPL2022: ముంబైకి అగ్ని పరీక్ష
IPL2022సీజన్‌లో ఇవాళ జరిగే మ్యాచ్ ముంబైకి అగ్ని పరీక్షలా మారనుంది. ఇవాళ లక్నో సూపర్ జాయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో లక్నో జట్టు 6 మ్యాచ్‌లు ఆడగా అందులో నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 6 పాయింట్లతో టాఫ్ 5లో ఉంది. మరోవైపు 7 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు ఇంత వరకు ఐపీఎల్ 2022 సీజన్‌లో బోణీ కొట్టలేకపోయింది.
దీంతో ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కి డూ ఆర్ డైగా మారింది. రోహిత్ సేనా ఈ మ్యాచ్‌లో గెలుపొందితేనే ఫ్లే ఆఫ్‌కు అవకాశాలు ఉంటాయి. ఒక వేళ ముంబై ఈ మ్యాచ్‌లో సైతం ఓడితే ప్లే ఆఫ్ అవకాశాలు చెజారినట్లే అవుతుంది. ఇక ముంబై లీగ్ మ్యాచ్‌లకే పరిమితం అవుతుంది. మరి ఈ మ్యాచ్‌లోనైనా ముంబై బోణీ కొడుతుందో లేదో చూడాలి మరి.