IPL2022: ఇవాళ బిగ్ ఫైట్
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇవాళ బిగ్ మ్యాచ్ జరగనుంది. ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో లక్నో సూపర్ జాయింట్స్ జట్టు తలపడనుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 మ్యాచ్‌లు ఆడగా.. అందులో 4 మ్యాచ్‌ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. మరోవైపు ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన లక్నో జట్టు నాలుగింట్లో గెలుపొందింది. ఆర్‌సీబీ కంటే నెట్ రన్‌రేట్ ఎక్కవగా ఉండటంతో లక్నో టీం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టాప్ 2కు వెళ్లనుంది.