IPL Play Offs Scenario: ఐపీఎల్ సీజన్ లో అసలైన సమరం మొదలైంది. ప్లే ఆఫ్స్ కోసం నున్వా నేనా అన్నట్లుగా పోటీ సాగుతోంది. ఇప్పటికే మూడు టీంలు ప్లే ఆఫ్స కు ఖరారయ్యాయి. నాలుగో స్థానం దక్కేదెవరికి తేలాలంటే ఆదివారం జరిగే లీగ్ లు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే. నాలుగో స్థానం కోసం ముంబాయి, ఆర్సీబీ పోటీ పడుతున్నాయి. రాజస్ధాన్ రాయల్స్ అవకాశం కోసం ఆశగా చూస్తోంది. ఈ రోజుతో ఐపీఎల్ లో లీగ్ దశ పూర్తి కానుంది. ఈ రోజు జరిగే రెండు మ్యాచ్ లు కీలకం గా మారుతున్నాయి.
తొలి మ్యాచ్ లో ముంబాయ్ వర్సస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ముంబాయిలో మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ కు ఈ మ్యాచ్ ఎటువంటి ప్రభావం చూపదు. ముంబాయికి మాత్రం ఈ మ్యాచ్ కీలకం. ముంబాయి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. 14 పాయింట్లతో పాటుగా మైనస్ 0.128 రన్ రేటుతో ఉంది. ప్లే ఆఫ్స్ లో నిలవాలంటే ఈ మ్యాచ్ లో భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ లో ముంబాయి గెలిస్తే 16 పాయింట్లకు చేరనుంది. ఫలితంగా నాలుగో స్థానంకు సాంకేతికంగా చేరుతుంది. అదే సమయంలో రన్ రేటు కీలకం కానుంది. ముంబాయి ఈ మ్యాచ్ లో గెలిచినా ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ఆర్సీబీ వర్సస్ గుజరాత్ మ్యాచ్ ఫలితం పైన ఆధార పడి ఉంటుంది.
రెండో మ్యాచ్ లో గుజరాత్ వర్సస్ ఆర్సీబీ మ్యాచ్ బెంగళూరులో జరగనుంది. గుజరాత్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఆర్సీబీకి మాత్రం ఈ మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆఫ్స్ ఛాన్స్ దక్కుతుంది. పోటీ ఇస్తున్న ముంబాయి కంటే ఆర్సీబీకి రన్ రేటు అధికంగా ఉంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలవటం ద్వారా 16 పాయింట్లకు చేరుతుంది. రన్ రేటు ఆధారంగా ముంబాయి కంటే మెరుగైన స్థానంలో ఉండటంతో ప్లే ఆఫ్స్ కు సులువుగా చేరుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లెక్కలతో ఆదివారం జరిగే రెండు మ్యాచ్ ల ఫలితాలు, రన్ రేటు ప్లే ఆఫ్స్ లో నాలుగో స్థానం ఖరారు చేయనున్నాయి.
ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరిన గుజరాత్ వర్సస్ చెన్నై మధ్యమ 23న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. ఈ రోజు జరిగే మ్యాచ్ లలో ముంబాయి, ఆర్సీబీ గెలిస్తే రెండు జట్లు 16 పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు రన్ రేటు కీలకం కానుంది. ఈ రెండు జట్లలో ఒకటి గెలిచి, మరొకటి ఓడితే గెలిచిన జట్టు నేరుగా ప్లే ఆఫ్స్ కు చేరుతుంది. ఒక వేళ ఈ రెండు ఓడిపోతే అప్పుడు ఆర్సీబీ, రాజస్థాన్, ముంబాయి తలో 14 పాయింట్లతో ఉంటాయి. ఆ సమయంలో ఈ మూడు జట్లతో రన్ రేటు ఆధారంగా ఒక జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుతుంది. ఇలాంటి సంక్లిష్ట సమీకరణాల నడుమ ఆదివారం జరిగే రెండు లీగ్ మ్యాచ్ లు ప్లే ఆఫ్స్ కే నాలుగో టీం ను ఖరారు చేయనున్నాయి.