ఐపీఎల్ 2023లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య రాత్రి 7 :30 ని.లకు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది.
MI vs LSG: ఐపీఎల్ 2023లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య రాత్రి 7 :30 ని.లకు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది. ఓడిన టీమ్ ఐపీఎల్ నుంచి ఇంటిబాట పట్టనుంది. మంగళవారం జరిగిన మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ని చెన్నై సూపర్ కింగ్స్ ఓడించి ఫైనల్‌కి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఎలా అయినా గెలిచి ఫైనల్ రేసులో ఇరు జట్లు నేటి సమరానికి సై అంటున్నాయి. ఇప్పటివరకు ఐపీఎల్లో ముంబై, లక్నో మూడు సార్లు తలపడ్డాయి. ఈ మూడు మ్యాచుల్లో లక్నో విజయాన్ని సాధించింది.
బ్యాటింగ్ విషయంలో లక్నో కంటే ముంబై టీమ్ చాలా బలంగా ఉంది. కానీ వరుస విజయాలతో ఉన్న లక్నో టీమ్ దూకుడు ఆట ప్రదర్శిస్తుంది. బెంగళూరు ఓటమితో అదృష్టం కలిసిరావడంతో ముంబై ప్లేఆఫ్స్‌లో స్థానాన్ని సంపాదించుకుంది. ఈ ఛాన్స్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో ముంబై ఉంది. బ్యాటింగ్ పరంగా ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్‌గానే ఉన్నా ఆటగాళ్లు సమిష్టిగా రాణించకపోవడమే ఆ జట్టుకు సమస్యగా మారుతోంది. కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లపైనే ముంబై బ్యాటింగ్ ఆశలు ఎక్కువగా ఉన్నాయి. కెప్టెన్రోహిత్ శర్మ ఇప్పటివరకు జట్టుకు ఉపయోగపడే భారీ ఇన్నింగ్స్ ఆడలేదు.
మరోవైపు లక్నో బ్యాటర్లలో నిలకడలేమి వెంటాడుతుంది. గత మ్యాచ్‌లను పరిశీలిస్తే సమిష్టిగా ఆడిన దాఖలాలు చాలా తక్కువ. బ్యాటింగ్ లో ఒకరో ఇద్దరో ఆడటం ద్వారానే ఆ జట్టు నెట్టుకొస్తున్నది. కైల్ మేయర్స్, డికాక్ శుభారంభం అందించడం కీలకం కానుంది. అలాగే, స్టోయినిస్, పూరన్ మిడిలార్డర్ జట్టుకు బలాన్నిచ్చే ఆటగాళ్లే అయినప్పటికీ అడపాదడపా భారీ ఇన్నింగ్స్‌లు తప్ప నిలకడగా వారు రాణించలేకపోతున్నారు. ముంబై బ్యాటర్లను అడ్డుకోవాలంటే బౌలర్లు కీలకంగా వ్యవహరించాల్సి ఉంది. మరి నేటి మ్యాచులో ఇంటిబాట పట్టేదెవరో తేలనుంది.