పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ప్రతీకారం తీర్చుకుంది. సొంతగడ్డపై తమకు ఎదురైన పరాజయానికి ఢిల్లీ దీటుగా బదులిచ్చింది.
PBKS vs DC: పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ప్రతీకారం తీర్చుకుంది. సొంతగడ్డపై తమకు ఎదురైన పరాజయానికి ఢిల్లీ దీటుగా బదులిచ్చింది. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలుద్దామనుకున్న పంజాబ్ ఆశలను ఢిల్లీ తుడిచి వేసింది..గెలుద్దామనుకుని తీవ్రంగా శ్రమించిన పంజాబ్ చివరకు చేతులెత్తేసింది. ఇప్పటికే ఢిల్లీ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. తనతో పాటు పంజాబ్ కింగ్స్‌కు కూడా ఇంటి బాట పట్టించింది. బుధవారం పంజాబ్‌కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 15 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ రెండు వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఢిల్లీ తరఫున వార్నర్ 46 , ఫృధ్వీ షా 54 , రిలీ రూసో 82, , సాల్ట్ 26 రన్స్ చేశారు. ఇక పంజాబ్ తరఫున సామ్ కర్రన్ ఢిల్లీ ఓపెనర్లను పెవిలియన్ చేర్చి, రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కి మొదట్లో గడ్డు పరిస్థితి ఎదురైంది. రెండో ఓవర్ తొలి బాల్కే పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ అవుట్ అయ్యాడు. గత మ్యాచ్ సెంచరీ హీరో ప్రభ్సిమ్రాన్ సింగ్ 22 పరుగులతో కొంతమేర పర్వాలేదనిపించగా.. అధర్వ థైడే 55 పరుగులు చేసి అర్ధసెంచరీతో చెలరేగాడు. అనంతరం వచ్చిన లియన్ లివింగ్స్టన్ 94 పరుగులతో మైదానంలో చెలరేగాడు. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడగా క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్ మేన్స్ విఫలం కావడంతో లివింగ్స్టన్ పోరాటం వృథా అయ్యింది. దీంతో పంజాబ్ టీమ్ 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసి విజయాన్ని ఢిల్లీచేతుల్లో పెట్టింది.